ENG vs IND 4th test KL Rahul Joins Tendulkar and Gavaskar In Elite List
టీమ్ఇండియా ఆటగాడు కేఎల్ రాహుల్ అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లాండ్‌లో ఇంగ్లాండ్ పై టెస్టుల్లో 1000 పరుగులు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో చోటు దక్కించుకుంటాడు. మాంచెస్టర్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో వ్యక్తిగత స్కోరు 11 పరుగుల వద్ద రాహుల్ ఈ ఘనత సాధించాడు.
ఇంగ్లాండ్‌లో ఇంగ్లాండ్ పై టెస్టుల్లో 1000 పరుగులు సాధించిన జాబితాలో సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, సునీల్ గవాస్కర్‌లు ఉండగా తాజాగా ఈ జాబితాలో రాహుల్ చేరాడు. అదే విధంగా ఇంగ్లాండ్‌లో టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన నాలుగో ఆటగాడిగా రికార్డుకు ఎక్కాడు.
ఇంగ్లాండ్‌లో ఇంగ్లాండ్ పై అత్యధిక పరుగులు చేసిన రికార్డు టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. టెండూల్కర్ 17 మ్యాచ్‌ల్లో 1575 పరుగులు చేశాడు. ఈ జాబితాలో ఆ తరువాత వరుసగా ద్రవిడ్, గవాస్కర్, రాహుల్ , కోహ్లీలు ఉన్నారు.
ఇంగ్లాండ్‌లో ఇంగ్లాండ్ పై అత్యధిక టెస్టు పరుగులు చేసిన భారత ఆటగాళ్లు వీరే..
సచిన్ టెండూల్కర్ – 17 మ్యాచ్‌ల్లో 1575 పరుగులు
రాహుల్ ద్రవిడ్ – 13 మ్యాచ్‌ల్లో 1376 పరుగులు
సునీల్ గవాస్కర్ – 16 మ్యాచ్‌ల్లో 1152 పరుగులు
కేఎల్ రాహుల్ – 13 మ్యాచ్‌ల్లో 1035 పరుగులు
విరాట్ కోహ్లీ – 15 మ్యాచ్‌ల్లో 976 పరుగులు
ఇక నాలుగో టెస్టు మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 4 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా (19), శార్దూల్ ఠాకూర్ (19) లు క్రీజులో ఉన్నారు. మిగిలిన ఆటగాళ్లలో యశస్వి జైస్వాల్ (58), సాయి సుదర్శన్ (61) లు హాఫ్ సెంచరీలు చేశారు. కేఎల్ రాహుల్ (46) రాణించగా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (12) విఫలం అయ్యాడు.