ENG vs IND 4th test : రిషబ్ పంత్ గాయంపై సాయి సుదర్శన్ కీలక అప్‌డేట్.. రెండో రోజు బ్యాటింగ్‌కు వస్తాడా? రాడా? అంటే..?
మాంచెస్టర్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో టీమ్ఇండియాకు బిగ్ షాక్ తగిలింది.

ENG vs IND 4th test Sai Sudharsan Key update on Rishabh Pant Injury
మాంచెస్టర్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో టీమ్ఇండియాకు బిగ్ షాక్ తగిలింది. భారత వైస్ కెప్టెన్, రిషబ్ పంత్ బ్యాటింగ్ చేస్తూ గాయపడ్డాడు. తొలి రోజు ఆటలో ఇంగ్లాండ్ పేసర్ క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో ఓ బంతిని రివర్స్ స్వీప్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే.. బాల్ బ్యాట్ ఎడ్జ్ తీసుకుని అతడి కుడి పాదానికి బలంగా తాకింది. వెంటనే పంత్ తీవ్రమైన నొప్పితో బాధపడ్డాడు.
వెంటనే ఫిజియో మైదానంలో వచ్చి అతడిని పరీక్షించాడు. ప్రాథమిక చికిత్స అందించినప్పటికి ఫలితం లేకపోయింది. అతడి పాదం బాగా వాయడంతో పాటు రక్తం కారుతూ కనిపించింది. దీంతో పంత్ రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. కనీసం అతడు నడవలేకపోవడంతో గోల్ఫ్‌కార్ట్‌లో మైదానం నుంచి బయటకు తీసుకువెళ్లారు. అతడి రిటైర్ హర్ట్ అయ్యే సమయనికి 37 పరుగులు చేశాడు.
COMEBACK STRONG, RISHABH PANT. 🤞 pic.twitter.com/mUOIFsfVL0
— Raja babu Singh (@rbsingh2018) July 23, 2025
కాగా.. ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో భీకర ఫామ్‌లో ఉన్న పంత్ గాయపడడం భారత్‌కు గట్టి ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు. రెండో రోజు గనుక అతడు బ్యాటింగ్‌కు రాకపోతే భారత స్కోరుపై తీవ్ర ప్రభావం చూపించడం కాయం.
పంత్ గాయంపై సాయి సుదర్శన్..
రిషబ్ పంత్ గాయంపై టీమ్ఇండియా యువ ఆటగాడు సాయి సుదర్శన్ కీలక అప్‌డేట్ ఇచ్చాడు. తొలి రోజు ఆట ముగిసిన తరువాత విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించాడు. పంత్ తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నట్లు చెప్పాడు. అతడిని స్కానింగ్ కోసం ఆస్పత్రికి తీసుకువెళ్లినట్లు వివరించాడు. రాత్రికి గాయం కాస్త తగ్గవచ్చునని అనుకుంటున్నట్లు చెప్పాడు. అతడి గాయం పై గురువారం ఓ క్లారిటీ వస్తుందన్నాడు.
WCL 2025 : 41 ఏజ్‌లోనూ ఏబీ డివిలియర్స్ స్టన్నింగ్ ఫీల్డింగ్.. మైండ్ బ్లోయింగ్.. వీడియో..
‘మాంచెస్టర్‌లో పంత్ చాలా బాగా చేశాడు. అతడు మళ్లీ బ్యాటింగ్‌కు రాకపోతే మేము ఒక బ్యాట్స్‌మెన్‌ను కోల్పోతాము. అది జట్టు స్కోరుపై ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. మేము.. మా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తాం. సాధ్యమైనంత ఎక్కువ సేపు బ్యాటింగ్ చేసేందుకు ప్రయత్నిస్తాం.’ అని సాయి సుదర్శన్ అన్నాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 4 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా (19), శార్దూల్ ఠాకూర్ (19) లు క్రీజులో ఉన్నారు. టీమ్ఇండియా బ్యాటర్లలో సాయి సుదర్శన్ (61), యశస్వి జైస్వాల్ (58)లు హాఫ్ సెంచరీలు చేశారు. కేఎల్ రాహుల్ (46) రాణించాడు. కెప్టెన్ గిల్ (12) విఫలం అయ్యాడు.