Yashasvi Jaiswal : మాంచెస్టర్‌లో చరిత్ర సృష్టించిన యశస్వి జైస్వాల్.. 51 ఏళ్లలో ఒకే ఒక భారత ప్లేయర్..
టీమ్ఇండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ అరుదైన ఘనత సాధించాడు.

Yashasvi Jaiswal becomes first Indian opener to score 50 plus runs at old trafford in last 50 years
టీమ్ఇండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ అరుదైన ఘనత సాధించాడు. మాంచెస్టర్‌లోని ఓల్ట్ ట్రాఫోర్డ్ మైదానంలో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో రాణించాడు. ఈ క్రమంలో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. గత 50 ఏళ్లలో ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో అర్థశతకం బాదిన తొలి భారత ఓపెనర్‌గా చరిత్ర సృష్టించాడు. గతంలో 1974 లో మాంచెస్టర్‌లో సునీల్ గవాస్కర్ సెంచరీ (101) చేశాడు.
ఈ మైదానంలో భారత జట్టు తాజా టెస్టు మ్యాచ్‌తో కలిపి 10 మ్యాచ్‌లు ఆడింది. సునీల్ గవాస్కర్, యశస్వి జైస్వాల్‌లు మాత్రమే ఓపెనర్లుగా 50 ఫ్లస్ స్కోరు సాధించారు.
అజారుద్దీన్ రికార్డు సమం..
కాగా.. ఈ మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్ మరో ఘనతను సొంతం చేసుకున్నాడు. ఇంగ్లాండ్ జట్టు పై అత్యంత వేగంగా 1000 పరుగులు చేసిన రెండో భారత ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలో భారత మాజీ కెప్టెన్ అజారుద్దీన్ రికార్డును సమం చేశాడు. అజారుద్దీన్, జైస్వాల్ ఇద్దరూ కూడా 16 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత అందుకున్నాడు.
ఇక ఇంగ్లాండ్ పై అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 1000 పరుగులు చేసిన రికార్డు టీమ్ఇండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పేరిట ఉంది. ద్రవిడ్ 15 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మైలురాయిని చేరుకున్నాడు.
WCL 2025 : 41 ఏజ్‌లోనూ ఏబీ డివిలియర్స్ స్టన్నింగ్ ఫీల్డింగ్.. మైండ్ బ్లోయింగ్.. వీడియో..
JAISWAL IS THE SECOND FASTEST TO COMPLETE 1000 RUNS AGAINST ENGLAND BY AN INDIAN BATTER IN TEST. 🤯 pic.twitter.com/xKgjRdGMqK
— Johns. (@CricCrazyJohns) July 23, 2025
ఇక ఈ మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్ మొత్తంగా 107 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 58 పరుగులు చేశాడు. మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 4 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. జడేజా (19), శార్దూల్ ఠాకూర్ (19) లు క్రీజులో ఉన్నారు.