IND vs ENG 2nd Test: రికార్డులు రప్పా రప్పా.. శుభ్‌మన్ గిల్ బ్రేక్ చేసిన రికార్డ్స్ ఇవే..

ఎన్నో రికార్డులను తిరగరాసిన శుభ్‌మన్ గిల్.. మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మన్స్‌.. ఆ స్టార్ బ్యాటర్లందరి కంటే గ్రేట్

IND vs ENG 2nd Test: రికార్డులు రప్పా రప్పా.. శుభ్‌మన్ గిల్ బ్రేక్ చేసిన రికార్డ్స్ ఇవే..

Updated On : July 3, 2025 / 8:02 PM IST

ఇంగ్లాండ్‌తో బర్మింగ్‌హామ్‌లో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్‌ శుభ్‌మన్ గిల్ డబుల్ సెంచరీ బాది పలు రికార్డులు తిరగరాశాడు. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో అత్యధిక టెస్ట్ స్కోరు చేసిన భారత కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ నిలిచాడు. 2018లో విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్‌పై 149 పరుగులు సాధించాడు. 1996లో సచిన్ టెండూల్కర్ చేసిన 122 పరుగులు చేశారు. విరాట్ కోహ్లీ సచిన్ రికార్డును బద్దలు కొట్టిన ఏడేళ్ల తర్వాత ఇప్పుడు గిల్ కొత్త రికార్డు నమోదు చేశాడు.

గిల్ ఎడ్జ్‌బాస్టన్‌లో టెస్ట్ మ్యాచులో సెంచరీ చేసిన ఐదో భారత ఆటగాడిగా చేరిన విషయం తెలిసిందే. దీంతో కోహ్లీ, రిషబ్ పంత్, సచిన్ టెండూల్కర్, రవీంద్ర జడేజా సరసన గిల్ చేరాడు. ఇంగ్లాండ్‌ గడ్డపై టెస్ట్ మ్యాచ్‌లో 150కు పైగా స్కోరు చేసిన రెండో భారత కెప్టెన్‌గానూ గిల్ నిలిచాడు. మొహమ్మద్ అజరుద్దీన్ తర్వాత గిల్ ఈ ఘనత సాధించాడు.

ఈ సిరీస్ మొత్తం గిల్ అద్భుత ఫామ్‌లో కొనసాగుతున్నాడు. వరుసగా రెండు టెస్టుల్లో సెంచరీలు చేశాడు. లీడ్స్‌లో హెడింగ్లీ వేదికగా తొలి ఇన్నింగ్స్‌లో 147 పరుగులు సాధించాడు. ఆ మ్యాచ్‌లో భారత్ 31 పరుగుల తేడాతో ఓడిపోయింది. కాగా, ఇటీవల రోహిత్ శర్మ టెస్ట్ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత గిల్ కెప్టెన్ అయ్యాడు.

బర్మింగ్‌హామ్‌లో భారత కెప్టెన్‌గా టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు

శుభ్‌మన్ గిల్ – 250+* (2025)

విరాట్ కోహ్లీ – 149 (2018)

ఎంఎస్ ధోని – 77 (2011)

ఎంఎస్ ధోని – 74* (2011)

విరాట్ కోహ్లీ – 51 (2018)

 

బర్మింగ్‌హామ్‌లో టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు

శుభ్‌మన్ గిల్ – 168* (2025)

విరాట్ కోహ్లీ – 149 (2018)

రిషబ్ పంత్ – 146 (2022)

సచిన్ టెండూల్కర్ – 122 (1996)

రవీంద్ర జడేజా – 104 (2022)

ఇంగ్లాండ్‌లో భారత కెప్టెన్‌గా అత్యధిక టెస్ట్ వ్యక్తిగత స్కోరు

మొహమ్మద్ అజారుద్దీన్ – 179 (1990) మాంచెస్టర్

శుభ్‌మన్ గిల్ – 205+* (2025) బర్మింగ్‌హామ్

విరాట్ కోహ్లీ – 149 (2018) బర్మింగ్‌హామ్

అలీ ఖాన్ పట్టౌడి – 148 (1967) లీడ్స్

శుభ్‌మన్ గిల్ – 147 (2025) లీడ్స్