WTC Finals: భారత్‌కు నిరాశే.. ఐసీసీ సంచలన నిర్ణయం.. 2031 వరకు WTC ఫైనల్స్ అక్కడే..
తొలిసారి జరిగిన డబ్ల్యూటీసీ 2021 ఫైనల్‌లో భారత్, న్యూజిలాండ్ తలపడ్డాయి. ఇంగ్లాండ్‌లోని సౌతాంప్టన్‌లో ఈ మ్యాచ్ జరిగింది.

WTC Finals: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ లకు సంబంధించి వేదికలను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఖరారు చేసింది. ఈ విషయంలో భారత్‌కు నిరాశే ఎదురైంది. వచ్చే మూడు డబ్ల్యూటీసీ ఫైనల్స్ ఎడిషన్లు ఇంగ్లాండ్‌లోనే జరుగుతాయని ఐసీసీ ప్రకటించింది. 2027, 2029, 2031 ఫైనల్స్‌కు ఇంగ్లాండ్ ఆతిథ్యం ఇవ్వనున్నట్లు వెల్లడించింది.
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2019 మొదలైంది. ఇప్పటివరకు జరిగిన మూడు ఫైనల్స్‌కు ఇంగ్లాండ్ ఆతిథ్యమిచ్చింది. ఇక రాబోయే మూడు డబ్ల్యూటీసీ (2027, 2029, 2031) ఫైనల్ మ్యాచ్‌ల ఆతిథ్య హక్కులను కూడా ఇంగ్లాండ్ దక్కించుకుంది. గత మూడు ఎడిషన్లలో ఈసీబీ (ECB) ట్రాక్ రికార్డ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐసీసీ ప్రకటించింది.
గత మూడు డబ్ల్యూటీసీ ఫైనల్స్ సౌథాంప్టన్ (2021), ది ఒవల్ (2023), లార్డ్స్ (2025) వేదికగా జరిగాయి. గత నెలలో ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్‌లో సౌతాఫ్రికా విజయం సాధించింది. అంతకుముందు రెండు ఎడిషన్లలో భారత్ ఫైనల్‌కు చేరగా.. 2021లో న్యూజిలాండ్, 2023లో ఆస్ట్రేలియా ఛాంపియన్‌గా నిలిచాయి.
తొలిసారి జరిగిన డబ్ల్యూటీసీ 2021 ఫైనల్‌లో భారత్, న్యూజిలాండ్ తలపడ్డాయి. ఇంగ్లాండ్‌లోని సౌతాంప్టన్‌లో ఈ మ్యాచ్ జరిగింది. డబ్ల్యూటీసీ 2023 ఫైనల్‌లో భారత్, ఆస్ట్రేలియా తలపడ్డాయి. ఓవల్ లో ఈ మ్యాచ్ జరిగింది. ఇక ఇటీవల దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య డబ్ల్యూటీసీ 2025 ఫైనల్ ఇంగ్లాండ్‌లోని లార్డ్స్‌లో జరిగింది. తొలిసారి న్యూజిలాండ్, రెండోసారి ఆస్ట్రేలియా, మూడోసారి దక్షిణాఫ్రికా విజేతలుగా నిలిచాయి.
వచ్చే మూడు పర్యాయాల్లో కనీసం ఒక్కదానికైనా ఆతిథ్యం ఇవ్వాలని బీసీసీఐ భావించింది. ఐసీసీ ఛైర్మన్‌గా జైషా ఉండటంతో అందుకు ప్రయత్నాలూ చేసింది. కానీ ఐసీసీ అందుకు విముఖత వ్యక్తం చేసింది. ఆదివారం జరిగిన సమావేశంలో రాబోయే మూడు డబ్ల్యూటీసీ (2027, 2029, 2031) ఫైనల్ మ్యాచ్‌ల వేదికలను ఖరారు చేసింది. ఈ మూడు మ్యాచ్‌ల ఆతిథ్య హక్కులను ఇంగ్లాండ్ దక్కించుకుంది.
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ప్రవేశపెట్టినప్పటి నుండి ఇంగ్లాండ్‌లోనే నిర్వహించబడింది. “తదుపరి మూడు ఐసిసి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి ఇంగ్లాండ్, వేల్స్ ఎంపిక కావడం మాకు చాలా సంతోషంగా ఉంది” అని ECB చీఫ్ ఎగ్జిక్యూటివ్ రిచర్డ్ గౌల్డ్ అన్నారు. ”ఈ దేశంలోని అభిమానులకు ఈ విలువైన ఆట ఫార్మాట్ పట్ల ఉన్న మక్కువకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మద్దతుదారులు ఈ ఆటల కోసం ఇక్కడికి ప్రయాణించడానికి ఇష్టపడటానికి ఇది నిదర్శనం” అని అన్నారు. లార్డ్స్‌లో జరిగిన 2025 ఫైనల్‌లో దక్షిణాఫ్రికా డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆస్ట్రేలియాను ఓడించింది. నాలుగు రోజుల్లో ఈ మ్యాచ్ కు 1,09,227 మంది హాజరయ్యారు. 225 మిలియన్ల డిజిటల్ వ్యూస్ వచ్చాయని ఐసిసి గత నెలలో ఒక ప్రకటనలో తెలిపింది. ”ఈ ఫైనల్స్‌ను నిర్వహించడం ఒక గౌరవం. మునుపటి ఎడిషన్లు ఏ విధంగా అయితే సక్సెస్ చేశామో.. అదే విధంగా వీటిని కూడా విజయవంతం చేసేలా ICCతో కలిసి పనిచేయడానికి మేము ఎదురుచూస్తున్నాము” అని గౌల్డ్ తెలిపారు.