Champions Trophy: ICC Champions Trophy: సెమీఫైనల్లో టీమిండియాను ఢీకొట్టే ప్రత్యర్థి ఏది? న్యూజిలాండ్ మీద గెలిస్తే ఏంటి? ఓడిపోతే ఏంటి?
గ్రూప్ బీలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, అఫ్ఘానిస్థాన్ ఉన్న విషయం తెలిసిందే.

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో నాకౌట్ స్టేజ్ మ్యాచులు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే గ్రూప్ ఏ నుంచి న్యూజిలాండ్, భారత్ నాకౌట్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. పాక్‌తో టీమిండియా గెలుపు తర్వాత మన జట్టు పాయింట్లు 4కు చేరుకున్నాయి. సోమవారం బంగ్లాదేశ్‌ను కివీస్ ఓడించడంతో న్యూజిలాండ్ ఖాతాలోనూ పాయింట్లు 4కు చేరుకున్నాయి.
సెమీ ఫైనల్ సంగతేంటి?
ఇప్పటికే గ్రూప్ ఏలో టాప్‌లో ఉన్న భారత్- న్యూజిలాండ్ జట్ల మధ్య మార్చి 2న పోరు జరగనుంది. ఈ మ్యాచ్ దుబాయ్‌లో జరుగుతుంది. గ్రూప్ దశలో జరగనున్న చివరి మ్యాచ్ ఇది.
ఒకవేళ ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తే గ్రూప్ ఏలో టాప్‌కు వెళ్తుంది. దీంతో గ్రూప్ బీలో సెకండ్ ప్లేస్‌లో ఉన్న జట్టుతో టీమిండియా సెమీఫైనల్‌లో ఆడాల్సి ఉంటుంది.
గ్రూప్ బీలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, అఫ్ఘానిస్థాన్ ఉన్న విషయం తెలిసిందే. మార్చి 2న న్యూజిలాండ్‌తో జరిగే గ్రూప్ దశ మ్యాచులో ఒకవేళ టీమిండియా ఓడిపోతే గ్రూప్ బీలో అగ్రస్థానంలో నిలిచిన జట్టుతో సెమీఫైనల్‌లో ఆడాల్సి ఉంటుంది.
ప్రస్తుతమైతే దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా గ్రూప్ బీలో చెరో రెండు పాయింట్లతో టాప్‌లో ఉన్నాయి. ఇక మొదటి సెమీ ఫైనల్ మార్చి 4న, మరో సెమీ ఫైనల్ మార్చి 5న జరుగుతుంది. వాటిల్లో గెలిచిన జట్లు మార్చి 9న జరిగే ఫైనల్‌లో తలపడతాయి. ఇక గ్రూప్ దశలో గెలుపు, ఓటములతో సంబంధం లేకుండా టీమిండియా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగే తొలి సెమీఫైనల్‌లో (మార్చి 4న) ఆడుతుంది.
గ్రూప్ బీలో అన్ని మ్యాచ్‌లు పూర్తయిన తర్వాతే టీమిండియా, న్యూజిలాండ్‌తో సెమీస్‌లో తలపడే జట్లు ఏవన్న విషయాన్ని కచ్చితంగా చెప్పగలం. అయితే, ప్రస్తుత ఫామ్ చూస్తుంటే సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా గ్రూప్ బీలో టాప్‌లో ఉండే అవకాశాలు ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.