Champions Trophy: బంగ్లాపై న్యూజిలాండ్ గెలవడంతో భారత్, పాక్ పరిస్థితులు ఎలా మారిపోయాయో తెలుసా? నెక్స్ట్ ఏంటి?
పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో న్యూజిలాండ్.. రెండో స్థానంలో భారత్ ఉన్నాయి.

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా పాకిస్థాన్‌లోని రావల్పిండిలో సోమవారం జరిగిన మ్యాచులో బంగ్లాదేశ్‌పై న్యూజిలాండ్ విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో గ్రూప్ ఏలో పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్ నాలుగు పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది.
టీమిండియాకు కూడా నాలుగు పాయింట్లే ఉన్నప్పటికీ నెట్ రన్‌రేట్ తక్కువగా ఉండడంతో రెండో స్థానంలో ఉంది. ఇక బంగ్లాదేశ్, పాకిస్థాన్ రెండు మ్యాచుల చొప్పున ఆడినప్పటికీ ఒక్క మ్యాచు కూడా గెలవకపోవడంతో ఆ జట్లకు ఒక్క పాయింట్ కూడా దక్కలేదు. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచులో గెలవడంతో భారత్ నాకౌట్ స్టేజ్‌కు చేరుకుంది.
సోమవారం జరిగిన మ్యాచులో బంగ్లాదేశ్‌ను ఓడించడంతో న్యూజిలాండ్ కూడా నాకౌట్‌లో తన స్పాట్‌ను బుక్ చేసుకుంది. గ్రూప్‌లో ఈ స్టేజ్‌కు చేరిన రెండో జట్టుగా నిలిచింది. ఇక బంగ్లాదేశ్, పాకిస్థాన్ పోటీ నుంచి పక్కకు తప్పుకున్నట్టే.
ఇరు జట్లు రెండేసి మ్యాచుల్లో ఓడిపోవడంతో వాటికి ఈ పరిస్థితి తలెత్తింది. ఫిబ్రవరి 27న పాకిస్థాన్, బంగ్లాదేశ్ తలపడనున్నాయి. అయితే, ఇది నామ మాత్రపు మాచే. ఇక టీమిండియా తన చివరి గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో మార్చి 2న తలపడుతుంది.
సోమవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచుతో గ్రూప్ ఏ సెమీస్ బెర్తులు కన్ఫామ్ అయిపోయాయి. గ్రూప్‌లోని నాలుగు జట్లలో అన్ని జట్టు ఇంకా ఒక్కో మ్యాచ్‌ను ఆడాల్సి ఉంది.
కాగా, న్యూజిలాండ్ బ్యాటర్ రచిన్ రవీంద్ర 112 పరుగులతో మెరవడంతో ఆ జట్టు విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 236 రన్స్ చేసింది. రచిన్ 112 , లేథమ్ 55 రన్స్‌తో రాణించడంతో న్యూజిలాండ్ 46.1 ఓవర్లలోనే 5 వికెట్ల నష్టానికి టార్గెట్ ఛేజ్ చేసింది. న్యూజిలాండ్‌ను బంగ్లా ఓడిస్తే ఛాంపియన్స్ ట్రోఫీ రేసులో ఉండవచ్చన్న పాకిస్థాన్ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది.