SA vs AUS WTC 2025 final : ప‌రుగులు చేయ‌డం మ‌రిచిపోయావా ఏంది..! నెట్టింట ఖ‌వాజా పై ట్రోల్స్‌..

లండ‌న్‌లోని ప్ర‌ఖ్యాత లార్డ్స్ మైదానంలో ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ (డ‌బ్ల్యూటీసీ) 2023-25 ఫైన‌ల్ మ్యాచ్ ప్రారంభ‌మైంది.

Fans troll Usman Khwaja after 20 ball duck on Day 1 of the WTC 2025 final

లండ‌న్‌లోని ప్ర‌ఖ్యాత లార్డ్స్ మైదానంలో ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ (డ‌బ్ల్యూటీసీ) 2023-25 ఫైన‌ల్ మ్యాచ్ ప్రారంభ‌మైంది. టాస్ గెలిచిన ద‌క్షిణాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఓపెన‌ర్లుగా ఉస్మాన్ ఖ‌వాజా, మార్న‌స్ ల‌బుషేన్‌లు వ‌చ్చారు.

అయితే.. ఉస్మాన్ ఖ‌వాజా ఈ మ్యాచ్‌లో 20 బంతులు ఆడి క‌నీసం ఒక్క ప‌రుగు చేయ‌కుండా డ‌కౌట్ అయ్యాడు. ఇన్నింగ్స్ 6.4 ఓవ‌ర్‌లో ర‌బాడ బౌలింగ్‌లో ఖ‌వాజా బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతిని మొద‌టి స్లిప్‌లో ఉన్న డేవిడ్ బెడింగ్ హామ్ చేతుల్లో ప‌డింది. దీంతో ఖ‌వాజా నిరాశ‌గా పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు.

డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ తొలి ఇన్నింగ్స్‌లో విఫ‌లం కావ‌డంతో ఖ‌వాజా పై నెట్టింట విమ‌ర్శల వ‌ర్షం కురుస్తోంది. ప‌రుగులు చేయ‌డం మ‌రిచిపోయాడ‌ని కొంద‌రు కామెంట్లు చేస్తున్నారు.

Bhuvneshwar Kumar : వార్నీ.. భువ‌నేశ్వ‌ర్ కుమార్‌లో ఈ టాలెంట్ కూడా ఉందా? ఇన్నాళ్లు తెల‌వ‌క‌పాయె..

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. స‌పారీ పేస‌ర్ల ధాటికి ఆస్ట్రేలియా విల‌విల‌లాడుతోంది. తొలి రోజు లంచ్ స‌మ‌యానికి మొద‌టి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు కోల్పోయి 67 ప‌రుగులు చేసింది. స్టీవ్ స్మిత్ 26 ప‌రుగుల‌తో ఆడుతున్నాడు. ఆసీస్ బ్యాట‌ర్ల‌లో ఖ‌వాజా (0), మార్న‌స్ ల‌బుషేన్ (17), కామెరాన్ గ్రీన్ (4), ట్రావిస్ హెడ్ (11)లు విఫ‌లం అయ్యారు. ద‌క్షిణాప్రికా బౌల‌ర్ల‌లో క‌గిసో ర‌బాడ, మార్కో జాన్సెన్‌లు చెరో రెండు వికెట్లు తీశారు.

Sourav Ganguly : ఇంగ్లాండ్ ప‌ర్య‌ట‌న‌కు భార‌త జ‌ట్టు ఎంపిక పై గంగూలీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. త‌ప్పు చేశారు..