Footballer Anusha: మట్టి పని నుంచి జాతీయ మెడల్ వరకు.. జాతీయ ఫుట్‌బాల్‭లో రాణిస్తున్న రైతు బిడ్డ అనూష

భారతదేశపు మొట్టమొదటి రెసిడెన్షియల్ ఉమెన్స్ అకాడమీని అనంతపురంలో ఏర్పాటు చేసి లలిగా ఫౌండేషన్ లక్ష్యం, ప్రతిభావంతుల సమగ్ర అభివృద్ధికి ఒక వేదికను అందించడం

Footballer Anusha: మట్టి పని నుంచి జాతీయ మెడల్ వరకు.. జాతీయ ఫుట్‌బాల్‭లో రాణిస్తున్న రైతు బిడ్డ అనూష

Updated On : October 22, 2023 / 9:27 PM IST

Footballer Anusha: 2018లో రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ ద్వారా అనంతపురం స్పోర్ట్స్ అకాడమీలో చేరిన ఔత్సాహిక ఫుట్‌బాల్ క్రీడాకారిణి అనూష మండల, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జూనియర్ ఫుట్‌బాల్ జట్టులో స్థానం పొందింది. వ్యవసాయ సమాజం నుంచి వచ్చిన అనూష ఇప్పుడు బెంగుళూరులో జరిగే జూనియర్ నేషనల్ కాంపిటీషన్స్, లీగ్స్‌లో పోటీ పడనుంది. దేశానికి ప్రాతినిధ్యం వహించడంతో పాటుగా, దేశానికి ఆమె స్వస్థలమైన ఆత్మకూర్‌కు అవార్డులను తీసుకురావాలనేది ఆమె కల. ఆమె కలలకు అండగా లలిగా ఫౌండేషన్ నిలిచింది.

footballer Anusha inspiring journey from rural farms to national football stadiums

భారతదేశపు మొట్టమొదటి రెసిడెన్షియల్ ఉమెన్స్ అకాడమీని అనంతపురంలో ఏర్పాటు చేసి లలిగా ఫౌండేషన్ లక్ష్యం, ప్రతిభావంతుల సమగ్ర అభివృద్ధికి ఒక వేదికను అందించడం. ఫుట్‌బాల్ ద్వారా అభివృద్ధిని ప్రోత్సహించడం లక్ష్యం గా చేసుకున్న సంస్థ, అనూష వంటి వ్యక్తులకు క్రీడలో శిక్షణ, విద్యాపరమైన మద్దతు, సామాజిక నైపుణ్యాలు అందిస్తుంది. అర్హత కలిగిన కోచ్‌లచే నిరంతరం శిక్షణ పొందే అనూష వంటి అభ్యర్థులు దేశంలోని అత్యుత్తమ ఆటగాళ్లతో పోటీ పడనుంది.