పురుషుల జట్టుకు కోచ్‌గా మహిళా క్రికెటర్.. చరిత్రలో తొలిసారి

పురుషుల జట్టుకు కోచ్‌గా మహిళా క్రికెటర్.. చరిత్రలో తొలిసారి

Former England Womens Keeper Sarah Taylor Joins Coaching Staff

Updated On : March 17, 2021 / 12:52 PM IST

ఇంగ్లండ్ మహిళా జట్టు మాజీ క్రికెటర్.. వికెట్ కీపర్ సారా టేలర్ కౌంటీ క్రికెట్‌లో ససెక్స్ క్లబ్ పురుషుల జట్టుకు కోచింగ్ ఇవ్వనున్నారు. ససెక్స్ పురుషుల జట్టు కోచింగ్ జట్టులో సారాను చేర్చారు. ఈ మహిళా క్రికెటర్ అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ వికెట్ కీపర్లలో ఒకరుగా ఉన్నారు. కౌంటీ క్రికెట్ పురుష సీనియర్ జట్టు స్పెషలిస్ట్ కోచింగ్ పదవికి నియమించబడిన మొదటి మహిళ టేలర్ కావడం విశేషం.

పురుషుల క్రికెట్ చరిత్రలో ఇదే మొదటిసారి. ఇది అరుదైన యాదృచ్చికం కాని స్వాగతించే దశ అని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారత జట్టు సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ట్వీట్ చేస్తూ, పురుషుల జట్టు కోచింగ్ సిబ్బందిలో మహిళలను చేర్చడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. 31 ఏళ్ల సారా 2019 సంవత్సరంలో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. చిన్న వయసులోనే సారా క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు చెప్పింది.

ఇంగ్లాండ్ జట్టుకు రెండు 50 ఓవర్ల ప్రపంచ కప్‌లను(2009 మరియు 2017) తెచ్చిపెట్టడంలో తన వంతు పాత్ర పోషించారు సారా. టెస్ట్ క్రికెట్లో 5 సార్లు మహిళల యాషెస్ సిరీస్‌లో భాగం అయ్యారు. ఇందులో 3 సార్లు ఇంగ్లాండ్ జట్టు విజేతగా నిలిచింది. తన 17 సంవత్సరాల వయస్సులో 2006 లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన సారా.. మూడు ఫార్మాట్లలో 226 మ్యాచ్‌ల్లో కీపర్‌గా 232 వికెట్లు తీసుకుంది. ఇది ప్రపంచ రికార్డు. అంతేకాదు ఆమె 6500 పరుగులు చేసింది. 2019 లో, ఆమె మానసిక ఆరోగ్యాన్ని (ఆందోళన) ఉటంకిస్తూ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పింది.