Shahid Afridi: పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది సోదరి మృతి

పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిదీ అఫ్రిది సోదరి మృతి చెందారు. ఈ విషయాన్ని అఫ్రిది మంగళవారం తన ట్విటర్ ఖాతా ద్వారా వెల్లడించారు.

Shahid Afridi: పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది సోదరి మృతి

Shahid Afridi

Updated On : October 17, 2023 / 2:25 PM IST

Shahid Afridi Sister Passed Away : పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది సోదరి మృతి చెందారు. ఈ విషయాన్ని అఫ్రిది మంగళవారం తన ట్విటర్ ఖాతా ద్వారా వెల్లడించారు. అఫ్రిది సోదరి కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. అయితే, సోమవారం సాయంత్రం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన సోదరిని అఫ్రిది పరామర్శించారు. అనంతరం తన ట్విటర్ ఖాతా ద్వారా.. నా సోదరి ప్రస్తుతం తన జీవితంకోసం పోరాడుతోంది. ఆమె ఆరోగ్యంకోసం దువాస్ చేయమని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. అల్లా ఆమెను త్వరగా కోలుకునేలా చేసి దీర్ఘాయుషు ప్రసాదించాలని కోరుకుంటున్నాను అని అఫ్రిది అన్నారు. అయితే, మంగళవారం ఉదయం ఆమె చనిపోయినట్లు అఫ్రిది మరో ట్వీట్ చేశారు.

Read Also : Rohit Sharma Pull Shot : అలా చెప్పడం విచిత్రంగా ఉంది..! ఐదుగురు పాక్ ప్లేయర్స్ పై మాజీ కెప్టెన్ సల్మాన్ బట్ ఆగ్రహం

మా ప్రియమైన సోదరి మరణించిందని అఫ్రిది తెలిపాడు. అఫ్రిదికి 11 మంది తోబుట్టువులు ఉన్నారు. ఇందులో ఆరుగురు సోదరులు, ఐదుగురు సోదరీణులు ఉన్నారు. వారిలో అతను ఐదవ వ్యక్తి. ఈ విషాదం నేపథ్యంలో పలువురు ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలియజేస్తున్నారు.