Rohit Sharma Pull Shot : అలా చెప్పడం విచిత్రంగా ఉంది..! ఐదుగురు పాక్ ప్లేయర్స్ పై మాజీ కెప్టెన్ సల్మాన్ బట్ ఆగ్రహం

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఒక వీడియోను పోస్టు చేసింది. ఇందులో పాకిస్థాన్ ఆటగాళ్లను అత్యుత్తమ పుల్ షాట్లు ఆడే బ్యాటర్ ఎవరో చెప్పమని అడిగారు.

Rohit Sharma Pull Shot : అలా చెప్పడం విచిత్రంగా ఉంది..! ఐదుగురు పాక్ ప్లేయర్స్ పై మాజీ కెప్టెన్ సల్మాన్ బట్ ఆగ్రహం

Former Pakistan Captain Salman Butt

Former Pakistan Captain Salman Butt : భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ 2023లో టీమిండియా దూసుకెళ్తుంది. వరుసగా మూడు మ్యాచ్ లలో విజయం సాధించింది. ఈనెల 14న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన పాకిస్థాన్ వర్సెస్ ఇండియా మ్యాచ్ లో భారత్ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శనతో ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించారు. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ ను కేవలం 192 పరుగులకే ఆలౌట్ చేసింది రోహిత్ సేన. ఆ తరువాత రోహిత్ శర్మ దూకుడైన బ్యాటింగ్ తో టీమిండియా కేవలం 30.3 ఓవర్లకే లక్ష్యాన్ని ఛేదించి పాక్ పై విజయం సాధించింది. తద్వారా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. అయితే, రోహిత్ శర్మను అవుట్ చేయడంలో విఫలమైన పాక్ బౌలర్లతీరును మాజీ పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ బట్ తీవ్రస్థాయిలో విమర్శించారు. ఇందుకు కారణం కూడా ఉంది.. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read Also : David Warner Brilliant Catch : వారెవ్వా.. శ్రీలంక – ఆస్ట్రేలియా మ్యాచ్ లో డేవిడ్ వార్నర్ అద్భుత క్యాచ్.. వీడియో వైరల్

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఒక వీడియోను పోస్టు చేసింది. ఇందులో పాకిస్థాన్ ఆటగాళ్లను అత్యుత్తమ పుల్ షాట్లు ఆడే బ్యాటర్ ఎవరో చెప్పమని అడిగారు. ఈ వీడియోలో హరీస్ రౌఫ్, ఇమామ్ ఉల్ హక్, షాదాబ్ ఖాన్, హసన్ అలీ, బాబర్ అజామ్ అందరూ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేరును చెప్పారు. రోహిత్ శర్మ ఫుల్ షాట్లు బాగా ఆడుతారని అన్నారు. పాకిస్థాన్ వర్సెస్ ఇండియా మ్యాచ్ సందర్భంగానూ రోహిత్ శర్మ ఫుల్ షాట్లతో భారీ సిక్సర్లు కొట్టిన విషయం విధితమే. అయితే, పాకిస్థాన్ ప్లేయర్స్ రోహిత్ శర్మ పేరు చెప్పడాన్ని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ బట్ తీవ్రంగా తప్పుబట్టారు.

Read Also : AUS vs SL : ఎట్ట‌కేల‌కు ప్ర‌పంచ‌క‌ప్‌లో ఆస్ట్రేలియా బోణీ.. శ్రీలంక పై ఘ‌న విజ‌యం

ఐసీసీ వీడియోను ప్రస్తావిస్తూ.. రోహిత్ ఫుల్ షాట్లు మంచిగా ఆడతాడని పాకిస్థాన్ ప్లేయర్స్ చెప్పారు. అయినా, అతన్ని కట్టడి చేసేందుకు ప్రణాళికలను అమలు చేయడంలో ఎందుకు విఫమయ్యారంటూ పాకిస్థాన్ ప్లేయర్స్ ను ప్రశ్నించాడు. రోహిత్ శర్మ ఫుల్ షాట్ సమర్థవంతంగా ఆడాడని పాక్ ఆటగాళ్లు చెప్పడం చాలా విచిత్రంగా ఉందని బట్ తన యూట్యూబ్ ఛానెల్ లో అప్ లోడ్ చేసిన వీడియోలో చెప్పాడు.

 

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)