David Warner Brilliant Catch : వారెవ్వా.. శ్రీలంక – ఆస్ట్రేలియా మ్యాచ్ లో డేవిడ్ వార్నర్ అద్భుత క్యాచ్.. వీడియో వైరల్

శ్రీలంక - ఆస్ట్రేలియా మ్యాచ్ లో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు నిశాంక, కుశాల్ పెరీరా ఆ జట్టుకు బలమైన ఆరంభాన్ని అందించారు.

David Warner Brilliant Catch : వారెవ్వా.. శ్రీలంక – ఆస్ట్రేలియా మ్యాచ్ లో డేవిడ్ వార్నర్ అద్భుత క్యాచ్.. వీడియో వైరల్

David Warner brilliant catch

ODI WORLD CUP 2023: భారత్ వేదికగా జరుగుతున్న వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో ఎట్ట‌కేల‌కు ఆస్ట్రేలియా బోణీ కొట్టింది. వ‌రుస‌గా భార‌త్‌, దక్షిణాఫ్రికా చేతుల్లో ఓడిన ఆసీస్.. లక్నో వేదిక‌గా శ్రీలంక‌తో జ‌రిగిన మ్యాచులో 5 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. 210 ప‌రుగుల ల‌క్ష్యాన్ని 35.2 ఓవ‌ర్ల‌లో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా బ్యాటర్ డేవిడ్ వార్నర్ అద్భుత క్యాచ్ అందుకున్నాడు. దాదాపు 25 మీటర్లు పరుగెత్తి అతడు ఈ క్యాచ్ అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

David Warner Brilliant Catch

David Warner Brilliant Catch

శ్రీలంక – ఆస్ట్రేలియా మ్యాచ్ లో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు నిశాంక, కుశాల్ పెరీరా ఆ జట్టుకు బలమైన ఆరంభాన్ని అందించారు. నిస్సాంక 67 బంతుల్ల్లో 61 పరుగులు, పెరీరా 82 బంతుల్లో 78 పరుగులు చేయడం విశేషం. అయితే వారి ఔట్ తరువాత మ్యాచ్ స్వరూపం మారిపోయింది. ఆస్ట్రేలియా బౌలర్లు విజృంభించారు. ఆస్ట్రేలియా స్పిన్నర్ జంపా వేసిన ఓవర్లో కుశాల్ మెండీస్ (9) ను ఔట్ చేశాడు. కుశాల్ వికెట్ జంపా కంటే వార్నర్ ఖాతాలో వేస్తే బాగుంటుందని చెప్పొచ్చు.

Read Also : Suryakumar Yadav : డ‌గౌట్‌లో తిన్నందుకు ట్రోలింగ్‌.. సూర్యకుమార్ యాద‌వ్ రిప్లై అదుర్స్‌.. ‘నాకు ఆర్డ‌ర్ ఇవ్వ‌కు..’

కుశాల్ కొట్టిన షాట్ కు వార్నర్ డీప్ మిడ్ వికెట్ నుంచి దాదాపు 25 మీటర్లు పరుగెత్తి అద్భుతమైన డ్రైవింగ్ క్యాచ్ అందుకున్నాడు. ఈ క్యాచ్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన క్రికెట్ ప్రియులు వార్నర్ ను ప్రశంసిస్తున్నారు. వారెవ్వా.. సూపర్ క్యాచ్ అంటూ అభినందిస్తున్నారు. అంతకు ముందు కమిన్స్ ఓవర్లో ఓపెనర్ నిశాంక కొట్టిన బాల్ ను వార్నర్ బౌండరీ లైన్ వద్ద అద్భుతంగా అందుకున్నాడు. ఇందుకు సంబంధించి వీడియో సైతం సోషల్ మీడియాలో వైరల్ మారిండి.

 

 

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)

 

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)