Women IPL: పూర్తి తరహాలో మహిళా ఐపీఎల్ – బీసీసీఐ సెక్రటరీ

మహిళల ఐపీఎల్‌ను పూర్తి తరహాలో నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని బీసీసీఐ సెక్రటరీ జైషా అంటున్నారు. వీలైనంత త్వరగా అంటే వచ్చే ఏడాదే నిర్వహించాలనుకుంటున్నట్లు తెలిపారు.

Women IPL: పూర్తి తరహాలో మహిళా ఐపీఎల్ – బీసీసీఐ సెక్రటరీ

Jay Sha

Updated On : February 7, 2022 / 3:50 PM IST

Women IPL: మహిళల ఐపీఎల్‌ను పూర్తి తరహాలో నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని బీసీసీఐ సెక్రటరీ జైషా అంటున్నారు. వీలైనంత త్వరగా అంటే వచ్చే ఏడాదే నిర్వహించాలనుకుంటున్నట్లు తెలిపారు. ముగ్గురు మహిళా జట్ల టీ20 ఛాలెంజ్ ను పురుషుల ఐపీఎల్ తో పాటే నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

మహిళల టీ20 ఛాలెంజ్ ఈ ఏడాది కూడా కొనసాగుతుందని అతి త్వరలోనే మొత్తం పరిస్థితులు మారతాయని వివరించారు. ‘బీసీసీఐ చిత్తశుద్ధితో ఉండటమే కాకుండా త్వరలో ఐపీఎల్ తరహాలో పూర్తి స్థాయి మహిళల లీగ్‌ను ప్రారంభించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటోందని మీకు హామీ ఇస్తున్నా. అభిమానులకు, ప్లేయర్లకు మహిళల టీ20 ఛాలెంజ్ మీద పెరుగుతున్న ఆసక్తి లీగ్ నిర్వహించేలా చేసింది.’ అని ఒక ఈ-మెయిల్ లో పేర్కొన్నారు షా.

త్వరలో జరగబోయే ఐపీఎల్ 2022 గురించి మాట్లాడుతూ పది జట్లతో బరిలోకి దిగడం కన్ఫామ్ అని అన్నారు. రెండేళ్లుగా పరిస్థితులు మారిపోయాయి. క్లిష్టమైన పరిస్థితుల్లో వేదికలను యూఏఈకి మార్చామని, దేశంలో పరిస్థితులను గమనిస్తున్నామని అవి తగ్గుముఖం పడితే లీగ్ ఇండియాలోనే నిర్వహించే ప్లాన్ చేస్తున్నామని’ వెల్లడించారు.

Read Also: వేసవిలో ఆరోగ్యానికి మేలు చేసే రాగిజావ

లీగ్ నిర్వహిస్తే మ్యాచ్ లన్నీ కొవిడ్-19 గైడ్ లైన్స్ కు అనుగుణంగానే జరుగుతాయని హామీ ఇచ్చారు. కమర్షియల్ గా ఆలోచించడం కంటే ముందు గేమ్ విస్తరణ అనేది చాలా ముఖ్యం. ఒలింపిక్స్ లో క్రికెట్ ను చూడాలని నేనూ అనుకుంటున్నా. అలా జరిగితే గేమ్ కచ్చితంగా ఇంకా ఇంప్రూవ్ అవుతుందని నమ్ముతున్నానని తెలిపారు షా.