Neeraj Chopra : నీరజ్ చోప్రా ఎదుట యువతుల డ్యాన్స్‌‌లు, ఏకిపారేస్తున్న నెటిజన్లు

ఒలింపిక్ బంగారు పతక విజేత నీరజ్ చోప్రాను రేడియో జాకీ మలిష్కా మెండోన్సా జూమ్ యాప్ ద్వారా ఇంటర్వ్యూ చేశారు. మలిష్క..యువతులు డ్యాన్స్ చేశారు.

Neeraj Chopra : నీరజ్ చోప్రా ఎదుట యువతుల డ్యాన్స్‌‌లు, ఏకిపారేస్తున్న నెటిజన్లు

Red Fm Rjs

Updated On : August 21, 2021 / 11:36 AM IST

Malishka Mendonsa : టోక్యో ఒలింపిక్ పోటీల్లో బంగారు పతకం తీసుకొచ్చి..భారత పతకాన్ని రెపరెపలాడించిన…నీరజ్ చోప్రా ఎదుట యువతులు చేసిన డ్యాన్స్ పై నెటిజన్లు మండిపడుతున్నారు. వారిని ఏకిపారేస్తున్నారు. దేశానికి గోల్డ్ మెడల్ తెచ్చిన వ్యక్తి ఎదుట ఇలాగేనా వ్యవహరించేది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒలింపిక్స్ బంగారు పతక విజేత నీరజ్ చోప్రాను రేడియో జాకీ మలిష్కా మెండోన్సా జూమ్ యాప్ ద్వారా ఇంటర్వ్యూ చేశారు. పలు ప్రశ్నలకు నీరజ్ సమాధానం ఇచ్చారు.

Read More : BSNL Best Offer : BSNL కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ఇదిగో.. రోజుంతా హైస్పీడ్ డేటా..!

మలిష్కతో పాటు అక్కడ మరికొందరు యువతులున్నారు. లాప్ ఎదుట ఓ పేపర్ పెట్టుకున్న మలిష్క..నీరజ్ ను ఇంటర్వ్యూ చేశారు. ఒక్కసారిగా…మలిష్క..యువతులు డ్యాన్స్ చేయడం మొదలు పెట్టారు. 1957 సంవత్సరంలో వచ్చిన బాలీవుడ్ సినిమా ‘నయా దౌర్’లోని ‘‘ఉడెన్ జబ్ జబ్ దల్హే తేరీ’ పాటకు నృత్యాలు చేశారు. వీరి డ్యాన్స్ చూస్తున్న నీరజ్ నవ్వుతూ మౌనంగా ఉండిపోవడం వీడియోలో కనిపించింది. దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్ వేదికగా..మలిష్కా ట్వీట్ చేశారు. తర్వాత..మేము ఏమీ ఏడిపించలేదు కదా అని మలిష్క ప్రశ్నించారు.

Read More :Constable Molested A Girl : బాలికపై కానిస్టేబుల్ లైంగిక దాడి

ఈ వీడియోను చూసిన పలువురు నెటిజన్లు ఫైర్ అయ్యారు. దేశానికి పతకం తెచ్చిన వ్యక్తితో ఇలాగేనా వ్యవహరించేది ? అంటూ ప్రశ్నలు కురిపించారు. మీ ప్రవర్తనతో తలదించుకొనేలా చేశారు..అతనికి మీరిచ్చే గౌరవం ఇదేనా అంటూ కొంతమంది నెటిజన్లు మండిపడ్డారు. ఇక నీరజ్ చోప్రా విషయానికి వస్తే…టోక్యోలో ఇటీవలే జరిగిన ఒలింపిక్ లో జావెలిన్ త్రోలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ఫైనల్ పోటీల్లో రెండో రౌండ్ లో 87.58 మీటర్లు విసిరి..స్వర్ణ పతకం గెలుపొందారు.