Sushil Kumar: అప్‌డేట్స్ తెలుసుకోవాలి.. జైల్లో టీవీ ఇప్పించండి – సుశీల్ కుమార్

హత్య కేసు ఆరోపణలు ఎదుర్కొంటున్న సుశీల్ కుమార్.. విచారణలో భాగంగా తీహార్ జైల్లో ఉంటున్నారు. రెజ్లింగ్ మ్యాచెస్ గురించి అప్‌డేట్స్ తెలుసుకోవాలని టీవీ ఇప్పించాలని జైలు అధికారులు చెప్పారు.

Sushil Kumar: అప్‌డేట్స్ తెలుసుకోవాలి.. జైల్లో టీవీ ఇప్పించండి – సుశీల్ కుమార్

Susheel Kuamr

Updated On : July 5, 2021 / 11:07 AM IST

Sushil Kumar: హత్య కేసు ఆరోపణలు ఎదుర్కొంటున్న సుశీల్ కుమార్.. విచారణలో భాగంగా తీహార్ జైల్లో ఉంటున్నారు. రెజ్లింగ్ మ్యాచెస్ గురించి అప్‌డేట్స్ తెలుసుకోవాలని టీవీ ఇప్పించాలని జైలు అధికారులు చెప్పారు. తనతో పాటు మరొక నిందితుడు అయిన అజయ్ కుమార్ మే23న ఢిల్లీలోని ముండ్కా ప్రాంతంలో అరెస్టు చేశారు.

అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు తీహార్ జైలు అధికారులకు సుశీల్ కుమార్ లెటర్ రాశారు. టైం గడవడం లేదని తనకు టెలివిజన్ ప్రొవైడ్ చేయాలని, రెజ్లింగ్ మ్యాచ్ గురించి అప్‌డేట్స్ తెలుసుకోవాలనుకుంటున్నట్లు అందులో పేర్కొన్నారు. సుశీల్ కస్టడీ జులై 9వరకూ కొనసాగనుంది. ముందుగా అరెస్టు చేసిన జైలులో కాకుండా మండోలి జైలులోని జైలు నెంబర్ 2కు తరలించారు.

చత్రసాల్ స్టేడియం ఘటనలో సంబంధం ఉన్న 12మందిని పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిసిందే. రెజ్లర్ సాగర్ ఢంకర్ అతని ఇద్దరు స్నేహితులపై ఛత్రసల్ స్టేడియం వద్ద దాడి జరిపారు. మే4, మే5న జరిగిన ఆస్తి వివాదం తగువును మళ్లీ లేవనెత్తారు. సుశీల్ ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న పోలీసులు దీనికి సంబంధించిన ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ లు ఉన్నాయని చెప్తున్నారు.