Google Search 2023 : ఈ ఏడాది ఐపీఎల్‌తో పాటు ఎక్కువ‌గా గూగుల్ సెర్చ్ చేసిన‌వి ఏంటో తెలుసా..?

Google year in search 2023 : మ‌రో 19 రోజుల్లో 2023 సంవ‌త్స‌రం ముగుస్తుంది. ఈ క్ర‌మంలో ప్ర‌ముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ ఈ ఏడాది త‌మ సెర్చ్ ఇంజిన్ లో బాగా సెర్చ్ చేసిన అంశాల‌ను వివ‌రాల‌ను విడుద‌ల చేసింది.

Google Search 2023 : ఈ ఏడాది ఐపీఎల్‌తో పాటు ఎక్కువ‌గా గూగుల్ సెర్చ్ చేసిన‌వి ఏంటో తెలుసా..?

Google Search 2023

భార‌త‌దేశానికి 2023 సంవ‌త్స‌రం బాగా క‌లిసి వ‌చ్చింది. అనేక రంగాల్లో ప్ర‌పంచందృష్టిని ఆకర్షించింది. చంద్ర‌యాన్-3, వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ఇలా ఎన్నో విష‌యాల్లో భార‌తదేశం పేరు మారుమోగిపోయింది. మ‌రో 19 రోజుల్లో 2023 సంవ‌త్స‌రం ముగుస్తుంది. ఈ క్ర‌మంలో ప్ర‌ముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ ఈ ఏడాది త‌మ సెర్చ్ ఇంజిన్ లో బాగా సెర్చ్ చేసిన అంశాల‌ వివ‌రాల‌ను విడుద‌ల చేసింది. మిగిలిన రంగాల విష‌యాల‌ను కాస్త ప‌క్క‌న బెడితే.. క్రీడారంగానికి సంబంధించి నెటీజ‌న్లు ఎక్కువ‌గా దేని గురించి సెర్చ్ చేశారో ఓ సారి చూద్దాం.

ప‌ది క్రీడా టోర్న‌మెంటుల‌కు సంబంధించి బాగా సెర్చ్ చేశారు. ఇక క్రికెట్ విష‌యానికి వ‌స్తే.. ప‌లు మ్యాచుల గురించి బాగా వెతికారు. టోర్న‌మెంట్‌ల విష‌యానికి వ‌స్తే.. గూగుల్ విడుద‌ల చేసిన టాప్‌-10ను బట్టి చూస్తే ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2023 అగ్ర‌స్థానంలో నిలిచింది. ఐపీఎల్ 2023 ట్యాగ్‌ను ఎక్కువ‌గా సెర్చ్ చేశారు. ఉమెన్స్ ప్రీమియ‌ర్ లీగ్‌తో పాటు పాకిస్థాన్ సూప‌ర్ లీగ్ లు ఈ జాబితాలో ఉన్నాయి.

MS Dhoni : రిష‌బ్‌పంత్‌, జ‌హీర్‌ఖాన్‌ల‌తో ధోనీ పార్టీలు..! ఫోటో వైర‌ల్‌

గూగులో సెర్చ్ చేసిన టాప్‌-10 టోర్న‌మెంట్ల వివ‌రాలు..

– ఇండియన్ ప్రీమియర్ లీగ్
– వ‌న్డే ప్ర‌పంచక‌ప్‌
– ఆసియా కప్
– ఉమెన్స్ ప్రీమియర్ లీగ్
– ఏషియన్ గేమ్స్
– ఇండియన్ సూపర్ లీగ్
– పాకిస్థాన్ సూపర్ లీగ్
– ది యాషెస్
– మహిళల ప్ర‌పంచ‌క‌ప్‌
– ఎస్‌ఏ 20 (సౌతాఫ్రికా టీ20 లీగ్)

మ్యాచుల విష‌యానికి వ‌స్తే..

భార‌త్, ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్ మ్యాచును ఎక్కువ మంది గూగుల్‌లో సెర్చ్ చేశారు. ఆ త‌రువాత న్యూజిలాండ్‌, భార‌త జ‌ట్ల జ‌రిగిన సెమీపైన‌ల్ మ్యాచ్ కోసం వెతికారు.

New Rule in Cricket : అల‌ర్ట్‌.. రేప‌టి నుంచే క్రికెట్‌లో కొత్త రూల్‌.. బౌల‌ర్ల‌కు క‌ష్ట‌కాల‌మే..!

గూగుల్‌లో ఈ ఏడాది సెర్చ్ చేసిన టాప్ 10 మ్యాచ్‌ల వివ‌రాలు ఇవే..
– భార‌త్ vs ఆస్ట్రేలియా (వన్డే ప్రపంచకప్ ఫైనల్)
– భార‌త్‌ vs న్యూజిలాండ్ (వన్డే ప్రపంచకప్ సెమీ ఫైనల్)
– భార‌త్‌ vs శ్రీలంక (ఆసియా కప్ 2023 ఫైనల్)
– భార‌త్‌ vs ఇంగ్లాండ్
– భార‌త్‌ vs ఐర్లాండ్
– ఇంగ్లాండ్ vs ఆస్ట్రేలియా
– భార‌త్‌ vs అఫ్గానిస్థాన్
– భార‌త్‌ vs బంగ్లాదేశ్
– గుజరాత్ టైటాన్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ (ఐపీఎల్ 2023 ఫైనల్)
– పాకిస్థాన్ vs న్యూజిలాండ్ ల‌ను ఎక్కువ‌గా నెటీజ‌న్లు ఈ ఏడాది గూగుల్‌లో సెర్చ్ చేశారు.