Hardik Pandya : ముంబై ఇండియన్స్ సూపర్ స్టార్ల జట్టన్న హార్దిక్.. రోహిత్ శర్మ స్ట్రాంగ్ రియాక్షన్.. వీడియో వైరల్

హార్డిక్ పాండ్యా వ్యాఖ్యలకు భిన్నంగా ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ స్పందించారు. ముంబై ఇండియన్స్ జట్టు బలమైన ప్లేయర్స్ తో ఉందని ప్రజలు అనుకుంటున్నారు...

Hardik Pandya

Rohit Sharma : ముంబై ఇండియన్స్ జట్టు యాజమాన్యం ఐపీఎల్ 2024కి కెప్టెన్ గా హార్డిక్ పాండ్యాను ప్రకటించిన విషయం తెలిసిందే. రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకోవడంతో రోహిత్ ఫ్యాన్స్ నుంచేకాక పలువురు మాజీ క్రికెటర్ల నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి. ముంబై యాజమాన్యం నిర్ణయం పట్ల సోషల్ మీడియా వేదికగా రోహిత్ ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇదే క్రమంలో కొందరు సోషల్ మీడియాలో రోహిత్, హార్దిక్ భిన్నవాదనలతో కూడిన వీడియోలను షేర్ చేస్తూ వివాదానికి మరింత ఆజ్యం పోస్తున్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read : Team India : ఆసీస్ చేతిలో చిత్తుగా ఓడిన పాకిస్తాన్‌.. టీమ్ఇండియాకు క‌లిసొచ్చిన అదృష్టం

గతంలో ఓ ఇంటర్వ్యూలో హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ జట్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ టైటాన్స్ జట్టుకు వెళ్లిన తరువాత హార్థిక్ ఈ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఐపీఎల్ ప్రాంచైజీ టైటిల్ ను గెలుచుకోవటానికి జట్టు సామర్థ్యాలను విశ్లేషిస్తూ రెండు కారణాలను హార్ధిక్ చెప్పారు. ఒకటి.. స్టార్ ఆటగాళ్లను కొనుగోలు చేయడం, రెండోది కెప్టెన్ జట్టు సభ్యులందరిని ఐక్యంచేసి జట్టును విజయతీరాలకు నడిపించడం. ఇందులో ముంబై ఇండియన్స్ జట్టును మొదటి విభాగంగా హార్డిక్ పేర్కొన్నాడు. అంటే.. ముంబై ఇండియన్స్ జట్టులో స్టార్ ప్లేయర్స్ ఎక్కువగా ఉన్నారని, ఫలితంగా టైటిల్స్ గెలుచుకోవటంలో వాళ్లకు ఈజీ అవుతుందని హార్దిక్ చెప్పుకొచ్చారు.

Also Read : SA vs IND 1st ODI : చిత్తుగా ఓడిన ద‌క్షిణాఫ్రికా.. మొద‌టి వ‌న్డేలో భార‌త్ విజ‌యం

చెన్నై సూపర్ కింగ్స్ జట్టును రెండో విభాగం కింద హార్డిక్ పేర్కొన్నారు. సీఎస్కే జట్టులో ఆటగాళ్లు ఎవరైనాసరే వారు అక్కడ సౌకర్యాన్ని పొందుతారు. తద్వారా వారినుంచి ఉత్తమంగా ఆటతీరును పొందారని చెప్పారు. తాను కెప్టెన్సీ వహించిన గుజరాత్ టైటాన్స్ జట్టును రెండో విభాగం కిందనే హార్డిక్ పేర్కొన్నాడు. అయితే, హార్డిక్ వ్యాఖ్యలకు భిన్నంగా ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ స్పందించారు. ముంబై ఇండియన్స్ జట్టు బలమైన ప్లేయర్స్ తో ఉందని ప్రజలు అనుకుంటున్నారు. కానీ, దాని వెనుక ఉన్న కృషి గురించి ఎవరూ మాట్లాడరు. తిలక్ వర్మ, నెహాల్ కథ.. బుమ్రా, హార్ధిక్ లాగానే ఉంటుంది. కొన్ని సంవత్సరాల తరువాత మాకు బలమైన జట్టు ఉందని ఎవరైనా చెబుతారు అంటూ రోహిత్ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రోహిత్, హార్దిక్ ల మధ్య వ్యాఖ్యలను యాక్షన్.. రియాక్షన్ గా వీడియోలను రూపొందించి సోషల్ మీడియోలో షేర్ చేస్తున్నారు.