SA vs IND 1st ODI : చిత్తుగా ఓడిన ద‌క్షిణాఫ్రికా.. మొద‌టి వ‌న్డేలో భార‌త్ విజ‌యం

జోహన్నెస్‌బర్గ్ వేదిక‌గా జ‌రిగిన మొద‌టి వ‌న్డేలో భార‌త్ 8 వికెట్ల తేడాతో ద‌క్షిణాఫ్రికా పై విజ‌యం సాధించింది

SA vs IND 1st ODI : చిత్తుగా ఓడిన ద‌క్షిణాఫ్రికా.. మొద‌టి వ‌న్డేలో భార‌త్ విజ‌యం

SA vs IND 1st ODI

Updated On : December 17, 2023 / 5:51 PM IST

8 వికెట్ల తేడాతో భార‌త్ విజ‌యం
117 స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని టీమ్ఇండియా రెండు వికెట్లు కోల్పోయి 16.4 ఓవ‌ర్ల‌లో ఛేదించింది. భార‌త బ్యాట‌ర్ల‌లో శ్రేయ‌స్ అయ్య‌ర్ (52; 45 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌), అరంగ్రేట బ్యాట‌ర్ సాయి సుద‌ర్శ‌న్ (55 నాటౌట్; 43 బంతుల్లో 9 ఫోర్లు) అర్ధ‌శ‌త‌కాల‌తో రాణించారు.

10 ఓవ‌ర్ల‌కు భార‌త స్కోరు 61/1
భార‌త ఇన్నింగ్స్‌లో తొలి 10 ఓవ‌ర్లు ముగిశాయి. వికెట్ న‌ష్టపోయిన టీమ్ఇండియా 61 ప‌రుగులు చేసింది. శ్రేయ‌స్ అయ్య‌ర్ (28), సాయి సుద‌ర్శ‌న్ (25)లు రాణించారు.

రుతురాజ్ గైక్వాడ్ ఔట్‌..
స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని ఛేదించేందుకు బ‌రిలోకి దిగిన భార‌త జ‌ట్టుకు షాక్ త‌గిలింది. ఓపెన‌ర్ రుతురాజ్ గైక్వాడ్ (5) ముల్డ‌ర్ బౌలింగ్‌లో ఎల్బీడ‌బ్ల్యూగా పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. దీంతో భార‌త్ 3.4వ ఓవ‌ర్‌లో 23 ప‌రుగుల వ‌ద్ద మొద‌టి వికెట్ కోల్పోయింది.

భార‌త ల‌క్ష్యం 117
భార‌త బౌల‌ర్లు విజృంభించ‌డంతో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ద‌క్షిణాఫ్రికా 27.3 ఓవ‌ర్ల‌లో 116 ప‌రుగుల‌కే ఆలౌటౌంది. స‌ఫారీ బ్యాట‌ర్ల‌లో ఫెహ్లుక్వాయో (33), టోనీ డి జోర్జి (28), మార్‌క్ర‌మ్ (12), తబ్రైజ్ షమ్సీ (11) మాత్ర‌మే రెండు అంకెల స్కోరు చేశారు. ముగ్గురు బ్యాట‌ర్లు డ‌కౌట్ అయ్యారు. భార‌త బౌల‌ర్ల‌లో అర్ష్‌దీప్ సింగ్ ఐదు వికెట్ల‌తో స‌త్తాచాటాడు. అవేశ్‌ఖాన్ నాలుగు, కుల్దీప్ యాద‌వ్ ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.

20 ఓవ‌ర్ల‌కు ద‌క్షిణాఫ్రికా స్కోరు 87/8
ద‌క్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో మొద‌టి 20 ఓవ‌ర్లు పూర్తి అయ్యాయి. ఎనిమిది వికెట్లు న‌ష్ట‌పోయిన ద‌క్షిణాఫ్రికా 87 ప‌రుగులు చేసింది. ఆండిల్ ఫెహ్లుక్వాయో (23), నాండ్రే బర్గర్ (2) లు ఆడుతున్నారు. అంత‌క‌ముందు డేవిడ్ మిల్ల‌ర్ (2), కేశ‌వ్ మ‌హ‌రాజ్ (4) లు ఔట్ అయ్యారు.

వ‌రుస బంతుల్లో రెండు వికెట్లు తీసిన అవేశ్ ఖాన్
అవేశ్‌ఖాన్ వ‌రుస బంతుల్లో రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. కెప్టెన్ మార్‌క్ర‌మ్‌ను క్లీన్‌బౌల్డ్ చేయ‌గా మల్డర్ ఎల్బీడ‌బ్ల్యూగా పెవిలియ‌న్‌కు చేర్చాడు. దీంతో ద‌క్షిణాఫ్రికా 10.2వ ఓవ‌ర్‌లో 52 ప‌రుగుల వ‌ద్ద ఆరో వికెట్ కోల్పోయింది.

క్లాసెన్ క్లీన్ బౌల్డ్
ద‌క్షిణాఫ్రికా మ‌రో వికెట్ కోల్పోయింది. అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో హెన్రిచ్ క్లాసెన్ (6) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 10 ఓవ‌ర్ల‌కు ద‌క్షిణాఫ్రికా స్కోరు 52 4. మార్‌క్ర‌మ్ (12), డేవిడ్ మిల్ల‌ర్ (0)లు ఆడుతున్నారు.

టోనీ డి జోర్జి ఔట్‌..
ద‌క్షిణాఫ్రికా మ‌రో వికెట్ కోల్పోయింది. అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో టోనీ డి జోర్జి (28 22 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) కేఎల్ రాహుల్ క్యాచ్ అందుకోవ‌డంతో ఔట్ అయ్యాడు. దీంతో 7.5వ ఓవ‌ర్‌లో 42 ప‌రుగుల వ‌ద్ద సౌతాఫ్రికా మూడో వికెట్ కోల్పోయింది.

ఒకే ఓవ‌ర్‌లో రెండు వికెట్లు తీసిన అర్ష్‌దీప్ సింగ్‌..
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ద‌క్షిణాఫ్రికాకు ఆరంభంలోనే భారీ షాక్ త‌గిలింది. ఒకే ఓవ‌ర్‌లో అర్ష్‌దీప్ సింగ్ రెండు వికెట్లు తీశాడు. 1.4వ బంతికి రిజా హెండ్రిక్స్ (0), 1.5వ బంతికి రాస్సీ వాన్ డెర్ డస్సెన్ (0)లను ఔట్ చేశాడు. దీంతో ద‌క్షిణాఫ్రికా మూడు ప‌రుగుల‌కే రెండు వికెట్లు కోల్పోయింది.

ద‌క్షిణాఫ్రికా తుది జ‌ట్టు : రీజా హెండ్రిక్స్, టోనీ డి జోర్జి, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్‌), హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీప‌ర్‌), డేవిడ్ మిల్లర్, వియాన్ ముల్డర్, ఆండిల్ ఫెహ్లుక్వాయో, కేశవ్ మహరాజ్, నాండ్రే బర్గర్, తబ్రైజ్ షమ్సీ

టీమ్ఇండియా తుది జ‌ట్టు : కేఎల్‌ రాహుల్ (కెప్టెన్‌), రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, శ్రేయాస్ అయ్యర్, తిలక్ వర్మ, సంజు శాంసన్, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, అవేష్ ఖాన్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్

టాస్..

జోహన్నెస్‌బర్గ్ వేదిక‌గా జ‌రుగుతున్న మొద‌టి వ‌న్డేలో ద‌క్షిణాఫ్రికా టాస్ గెలిచింది. మ‌రో ఆలోచ‌న లేకుండా కెప్టెన్ మార్క్ర‌మ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.