Hardik Pandya bowls with red ball triggers speculation over Test comeback
Hardik Pandya – gautam gambhir : అప్పుడెప్పుడో 2018లో హార్దిక్ పాండ్యా చివరి సారి టెస్టు మ్యాచ్ ఆడాడు. వెన్నెముక సర్జరీ తరువాత నుంచి కేవలం పరిమిత ఓవర్ల క్రికెట్‌కే పరిమితం అయ్యాడు. అయితే.. ప్రస్తుతం అతడు మనసును మార్చుకున్నట్లుగా తెలుస్తోంది. మళ్లీ టెస్టులు ఆడాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందుకోసం అతడు సిద్ధం అవుతున్నాడు. తాజాగా పాండ్యా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ వీడియో ఈ వార్తలకు బలాన్ని చేకూర్చుతోంది.
హార్దిక్ పాండ్యా ఎర్ర బంతితో ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను అతడు తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేశాడు. హార్దిక్ ఇప్పటి వరకు 11 టెస్టులు ఆడాడు. 523 పరుగులు, 17 వికెట్లు తీశాడు.
ఈ ఏడాది చివరిలో భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. అక్కడ ఆస్ట్రేలియాతో భారత్ 5 మ్యాచుల టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ నేపథ్యంలో పేస్ ఆల్‌రౌండర్‌గా పాండ్య జట్టులో ఉంటే ఓ అదనపు బ్యాటర్ లేదా బౌలర్‌ను తీసుకునే వెలుసుబాటు జట్టుకు ఉంటుంది. ఈ ఆలోచనతోనే పాండ్యాను సిద్ధం చేసే పనిలో హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్ ఉన్నట్లు సమాచారం.
టీమ్ఇండియాలో చోటు దక్కాలంటే స్టార్ ప్లేయర్లు కూడా దేశవాళీ క్రికెట్ ఆడాలని ఇటీవల బీసీసీఐ రూల్ పెట్టిన సంగతి తెలిసిందే. మరి ఈ నిబంధన పాండ్యా కు వర్తిస్తుందా? లేదా? అన్నది చూడాలి. ఒకవేళ ఆడాలని బీసీసీఐ చెబితే మాత్రం అతడు బరోడా తరుపున దేశవాళీ క్రికెట్ ఆడతాడని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి.
రాత్రి 2.30కి రోహిత్ శర్మ మెసేజ్ పంపాడు.. ఎందుకంటే?: పీయూష్ చావ్లా
Hardik Pandya in the practice session. 🔥 pic.twitter.com/JW5vkVLUZq
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 12, 2024