హమ్మయ్య: పాండ్యాకు గుడ్ న్యూస్

హార్దిక్ పాండ్యా ఇటీవల ఫుల్ ఫామ్ తో పుంజుకొంటున్న సంగతి తెలిసిందే. దాంతో పాటు పాండ్యాపై ఉన్న కాఫీ విత్ కరణ్ షో వివాదం కూడా రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది.

హమ్మయ్య: పాండ్యాకు గుడ్ న్యూస్

Updated On : April 9, 2019 / 5:14 AM IST

హార్దిక్ పాండ్యా ఇటీవల ఫుల్ ఫామ్ తో పుంజుకొంటున్న సంగతి తెలిసిందే. దాంతో పాటు పాండ్యాపై ఉన్న కాఫీ విత్ కరణ్ షో వివాదం కూడా రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది.

హార్దిక్ పాండ్యా ఇటీవల ఫుల్ ఫామ్ తో పుంజుకొంటున్న సంగతి తెలిసిందే. దాంతో పాటు పాండ్యాపై ఉన్న కాఫీ విత్ కరణ్ షో వివాదం కూడా రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది. ఈ మధ్యనే కోర్టుకు హాజరుకావాలని రాజస్థాన్ కోర్టు సమన్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీని నుంచి పాండ్యాకు కాస్త ఉపశమనం లభించింది. రాజస్థాన్ హైకోర్టు ఏర్పాటు చేసిన జోధ్ పూర్ బెంచ్ ఈ ఫాస్ట్ బౌలర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్న పాండ్యా.. ఈ సారి వాయిదా వరకూ ప్రశాంతంగా ఉండొచ్చు. గత వారం విడుదల చేసిన సమన్లలో రాహుల్.. పాండ్యాలు కచ్చితంగా హాజరుకావాలసిందేనని చెప్పిన హైకోర్టు మరో వాయిదాకు హాజరవమని నిబంధనలు సడలించింది. 

హార్దిక్ పాండ్యా ప్రస్తుతం ముంబై ఇండియన్స్ తరపున ఆడుతుండగా, కేఎల్ రాహుల్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరపున ఆడుతున్నాడు. పాండ్యాకు ఇచ్చిన రిలాక్సేషన్ వంటిదే మరో ప్లేయర్ కేఎల్ రాహుల్ కు ఇచ్చినట్లు కోర్టు తెలిపింది. ఈ వివాదంపై 2 మ్యాచ్ ల పాటు వీరిద్దరూ నిషేదం అనుభవించిన సంగతి కూడా తెలిసిందే. 
Read Also : అశ్విన్ దెబ్బకి వార్నర్ వెనక్కి పరిగెత్తాడు