ఇందుకే ముంబై ఇండియన్స్‌ ఓడిపోయింది: కెప్టెన్ హార్దిక్ పాండ్యా కామెంట్స్‌

తాను కూడా కెప్టెన్‌గా తడబడ్డానని అన్నాడు.

ఇందుకే ముంబై ఇండియన్స్‌ ఓడిపోయింది: కెప్టెన్ హార్దిక్ పాండ్యా కామెంట్స్‌

Courtesy BCCI

Updated On : June 2, 2025 / 7:26 AM IST

ఐపీఎల్‌ 2025లో భాగంగా పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య నిన్న జరిగిన క్వాలిఫయర్ 2 మ్యాచులో తమ జట్టు ఓడిపోవడంపై ఎంఐ కెప్టెన్‌ హార్దిక్ పాండ్యా స్పందించాడు. మ్యాచ్ ముగిశాక హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ… పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్‌లో అద్భుతంగా రాణించాడని, అలాగే, తమ జట్టు బౌలింగ్‌లో విఫలమైందని అన్నాడు.

ఈ కారణాల వల్లే తాము ఓడిపోయామని  చెప్పాడు. తాము అనుకున్న మేరకు బౌలింగ్ చేయలేకపోయామని అన్నాడు. నిన్నటి మ్యాచులో బుమ్రా నాలుగు ఓవర్లు వేసి ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు. అంతేగాక, 40 పరుగులు ఇచ్చుకున్నాడు. బుమ్రా వైఫల్యమవ్వడం కూడా ముంబై విజయవకాశాలను దెబ్బతీసిందని హార్దిక్ పాండ్యా అన్నాడు.

Also Read: దడదడలాడించిన శ్రేయస్‌… ఐపీఎల్‌ ఫైనల్లో ఆర్సీబీతో తలపడనున్న పంజాబ్‌

ఇంతకుముందు మ్యాచ్‌లలో బౌలింగ్‌ చేసినట్లు ఈ మ్యాచులోనూ అతడు బాగా బౌలింగ్‌ చేస్తే మ్యాచ్‌లో గెలిచేవాళ్లమని హార్దిక్ చెప్పాడు. పంజాబ్ కెప్టెన్, బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్‌లో రిస్క్ తీసుకున్న విధానం చాలా బాగుందని, అద్భుతంగా షాట్స్ ఆడాడని తెలిపాడు.

పంజాబ్ జట్టు బ్యాటింగ్ తీరు చాలా బాగుందని హార్దిక్ అన్నాడు. అయినప్పటికీ ఛేదించగలిగిన లక్ష్యమే తమ ముందు ఉందని, కానీ తమ బౌలింగ్ తీరు ఆశించిన మేరకు లేదని తెలిపాడు. పంజాబ్ బ్యాటర్లు ప్రశాంతంగా ఆడి ముంబై జట్టును ఒత్తిడిలో పడేశారని చెప్పాడు. తాను కూడా కెప్టెన్‌గా తడబడ్డానని అన్నాడు.