Hardik Pandya Unnecessarily trolled by Rohit Sharma Fans
Hardik Pandya – Rohit Sharma : ఐపీఎల్ 2024 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ జట్టుకు ఐదు సార్లు ఐపీఎల్ ట్రోఫీని అందించిన హిట్‌మ్యాన్ రోహిత్ శర్మను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించింది. అతడి స్థానంలో హార్దిక్ పాండ్యకు నాయకత్వ బాధ్యతలు అప్పగించింది. దీంతో అభిమానులు ముంబై ఇండియన్స్ పై గుర్రుగా ఉన్నారు. కాగా.. దీనిపై ఇంత వరకు రోహిత్ శర్మ స్పందించలేదు. అటు హార్దిక్ పాండ్య సైతం కెప్టెన్సీ దక్కడం పై ఎలాంటి కామెంట్లు చేయలేదు.
ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా నియమితుడైన తరువాత హార్దిక్ పాండ్య తొలి సారి బయట కనిపించాడు. అయితే.. అతడికి చేదు అనుభవం ఎదురైంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముంబై ఎయిర్ పోర్ట్‌కు హార్దిక్ పాండ్య వచ్చాడు. తన కారులోంచి బయటకు దిగాడు. అతడిని గమనించిన అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ‘ముంబైకా రాజా రోహిత్ శర్మ’ అంటూ గట్టిగా కేకలు వేశారు. దీంతో పాండ్య కొంచెం అసహనానికి గురైనట్లు వీడియోలో కనిపిస్తోంది.
Team India : మూడో వన్డేలో దీన్ని గమనించారా..? చాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే ఇది సాధ్యం..!
ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా.. దీనిపై అభిమానులు రెండుగా విడిపోయారు. కొందరు రోహిత్ కు మద్దతుగా కామెంట్లు చేస్తుండగా ఇంకొందరు మాత్రం హార్దిక్ మద్దతుగా కామెంట్లు పెడుతున్నారు. ఏదీ ఏమైనప్పటికీ ఇలా చేయడం సరికాదని ఇంకొందరు అంటున్నారు.
ఇదిలా ఉంటే.. డిసెంబర్ 26 నుంచి భారత జట్టు దక్షిణాఫ్రికాతో రెండు టెస్టు మ్యాచుల సిరీస్ ఆడనుంది. రోహిత్ శర్మ సారథ్యంలో భారత జట్టు ఈ సిరీస్ గెలవాలని పట్టుదలగా ఉంది. డబ్ల్యూటీసీ 2023-25 సైకిల్‌లో ఫైనల్ చేరుకోవాలంటే ఈ రెండు మ్యాచుల సిరీస్‌లో భారత జట్టు విజయం సాధించడం తప్పనిసరి. కాగా.. ప్రస్తుతం టీమ్ఇండియా డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉంది. కాగా.. వన్డే ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచులో హార్దిక్ పాండ్య గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో అతడు దక్షిణాప్రికా పర్యటనకు దూరంగా ఉన్నాడు.
People are shouting ‘Mumbai Cha Raja Rohit Sharma’ infront of Hardik Pandya.
Rohit Sharma is an emotion of India.?
SHAMELESS MUMBAI INDIANS pic.twitter.com/qp5P8O30VF
— ???????? ? (@ImHydro45) December 21, 2023