ICC Test Rankings : ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌.. హ్యారీ బ్రూక్ దెబ్బ‌కు దిగ‌జారిన జైస్వాల్ ర్యాంక్‌..

బుధ‌వారం అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టెస్టు ర్యాంకింగ్స్‌ను విడుద‌ల చేసింది.

ICC Test Rankings : ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌.. హ్యారీ బ్రూక్ దెబ్బ‌కు దిగ‌జారిన జైస్వాల్ ర్యాంక్‌..

Harry Brook trumps Yashasvi Jaiswal in ICC Test rankings after majestic 171

Updated On : December 4, 2024 / 5:14 PM IST

బుధ‌వారం అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టెస్టు ర్యాంకింగ్స్‌ను విడుద‌ల చేసింది. టీమ్ఇండియా స్టార్ ఆట‌గాళ్లు విరాట్ కోహ్లీ, య‌శ‌స్వి జైస్వాల్ ర్యాంకులు దిగ‌జారాయి. పెర్త్‌లో ఆస్ట్రేలియాతో జ‌రిగిన తొలి టెస్టులో అద్భుత‌మైన సెంచ‌రీ చేసిన య‌శ‌స్వి త‌న కెరీర్‌లో అత్యుత్త‌మమైన రెండో స్థానానికి చేరుకున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ప్ర‌క‌టించిన ర్యాంకుల్లో అత‌డు రెండు స్థానాలు దిగ‌జారాడు. నాలుగో ర్యాంకుకు ప‌డిపోయాడు.

ఇందుకు ఇంగ్లాండ్ బ్యాట‌ర్ హ్యారీ బ్రూక్ కార‌ణం. న్యూజిలాండ్ పై బ్రూక్ 171 ప‌రుగుల‌తో రాణించ‌డంతో అత‌డు రెండో స్థానానికి చేరుకున్నాడు. తొలి స్థానంలో జోరూట్ ఉన్నాడు. ఇక టీమ్ఇండియా బ్యాట‌ర్ రిష‌బ్ పంత్ ఆరో స్థానంలోనే కొన‌సాగుతున్నాడు. అటు విరాట్ కోహ్లీ 14వ స్థానానికి ప‌డిపోయాడు.

Big Cricket League : బిగ్ క్రికెట్ లీగ్ తొలి సీజ‌న్ షెడ్యూల్ వ‌చ్చేసింది.. డిసెంబ‌ర్ 12 నుంచి..

ఐసీసీ టెస్టు బ్యాట‌ర్ల ర్యాంకింగ్స్‌..

* జో రూట్ (ఇంగ్లాండ్‌) – 895 రేటింగ్ పాయింట్లు
* హ్యారీ బ్రూక్ (ఇంగ్లాండ్‌) – 854 రేటింగ్ పాయింట్లు
* కేన్ విలియ‌మ్స‌న్ (న్యూజిలాండ్‌) – 830 రేటింగ్ పాయింట్లు
* య‌శ‌స్వి జైస్వాల్ (భార‌త్‌) – 825 రేటింగ్ పాయింట్లు
* డారిల్ మిచెల్ (న్యూజిలాండ్) – 753 రేటింగ్ పాయింట్లు

ఇక బౌల‌ర్ల విభాగంలో టీమ్ఇండియా పేస్ గుర్రం జ‌స్‌ప్రీత్ బుమ్రా అగ్ర‌స్థానంలోనే కొన‌సాగుతున్నాడు. ర‌విచంద్ర‌న్ అశ్విన్ నాలుగు, ర‌వీంద్ర జ‌డేజా ఆరో స్థానంలో ఉన్నారు.

ACC U19 Asia Cup 2024 : అండ‌ర్‌-19 ఆసియా క‌ప్ సెమీస్‌కు భార‌త్‌.. దంచికొట్టిన 13 ఏళ్ల వైభ‌వ్ సూర్య‌వంశీ..

ఐసీసీ టెస్టు బౌల‌ర్ల‌ ర్యాంకింగ్స్‌..

* జ‌స్‌ప్రీత్ బుమ్రా (భార‌త్‌) – 883 రేటింగ్ పాయింట్లు
* క‌గిసో ర‌బాడ (ద‌క్షిణాఫ్రికా) – 865 రేటింగ్ పాయింట్లు
* జోష్ హేజిల్‌వుడ్ (ఆస్ట్రేలియా) – 860 రేటింగ్ పాయింట్లు
* ర‌విచంద్ర‌న్ అశ్విన్ (భార‌త్‌) – 807 రేటింగ్ పాయింట్లు
* పాట్ క‌మిన్స్ (ఆస్ట్రేలియా) – 796 రేటింగ్ పాయింట్లు