Yuvraj Singh : ఒక ఓవర్లో 6 సిక్సులది ఏముంది.. ఎవరైనా కొట్టే చాన్స్ ఉంది.. కానీ యువరాజ్ సింగ్ ఈ రికార్డు బద్దలు కొట్టాలంటే తాతలు దిగిరావాల్సిందే.
భారత జట్టు రెండు ప్రపంచకప్‌లు గెలవడంతో కీలక పాత్ర పోషించాడు యువరాజ్ సింగ్ (Yuvraj Singh)
HBD Yuvraj Singh do you these unbreakable records of all rounder yuvi
Yuvraj Singh : టీమ్ఇండియాకు రెండు ప్రపంచకప్‌లు అందించింది ఎవరు అంటే అందరూ ఠక్కున చెప్పే సమాధానం ఎంఎస్ ధోని. నిజమే ధోని సారథ్యంలోని భారత్ 2007 టీ20, 2011 వన్డే ప్రపంచకప్‌లను అందుకుంది. అయితే.. ఈ మెగా టోర్నీల్లో ఓ ప్లేయర్ తన ఆల్‌రౌండ్ నైపుణ్యాలతో భారత్ ప్రపంచకప్‌లు గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. అతడు మరెవరో కాదు యువరాజ్ సింగ్. కాన్సర్‌ను జయించిన ఈ పోరాట యోధుడి పుట్టిన రోజు నేడు (డిసెంబర్ 12).
క్రికెట్ ప్రపంచంలో ఎన్నో రికార్డులు నెలకొల్పాడు యువీ. అందులో కొన్ని అద్భుతమైన రికార్డులు ఇప్పుడు చూద్దాం..
ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు..
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఒకే ఓవర్‌లో యువీ ఆరు సిక్సర్లు బాదాడు. 2007 టీ20 ప్రపంచకప్ సందర్భంగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో ఈ అద్భుతాన్ని సాధించాడు. క్రికెట్ అభిమానులు యువీ కొట్టిన ఈ ఆరు సిక్సర్లను ఎవరూ అంత త్వరగా మరచిపోలేరు.
పిచ్చకొట్టుడు కొట్టిన వైభవ్ సూర్యవంశీ.. 14 సిక్సర్లు.. డబుల్ సెంచరీకి జస్ట్ మిస్.. కానీ..
ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ..
ఇదే మ్యాచ్‌లో యువరాజ్ సింగ్ అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ సాధించాడు. 12 బంతుల్లోనే అర్థశతకాన్ని సాధించాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో సుదీర్ఘకాలం ఈ రికార్డు యువీ పేరిటే ఉంది.
ఒకే ఐపీఎల్‌లో రెండు హ్యాట్రిక్‌లు..
యువరాజ్ సింగ్ బ్యాట్‌తోనే కాదు బంతితో మాయ చేస్తాడు అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐపీఎల్‌లో ఒకే సీజన్‌లో రెండు హ్యాట్రిక్‌లు సాధించిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. 2009 సీజన్‌లో యువీ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కు సారథ్యం వహిస్తూ ఈ ఘనత సాధించాడు.
అన్ని ఐసీసీ ట్రోఫీలు గెలిచిన ఆటగాడు..
యువీ ఐసీసీ అందించే అన్ని ఐసీసీ ట్రోఫీలను గెలుచుకున్నాడు. అండర్-19 ప్రపంచకప్, టీ20 ప్రపంచకప్, వన్డే ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోపీ వంటి ఐసీసీ టోర్నీలను గెలుచుకున్న ఏకైక భారత క్రికెటర్.
