T20 World Cup 2021: చివరి 2 బంతులకు 12 స్కోరు చేయగలడు.. అతణ్ని జట్టులోకి తీసుకోండి – హర్భజన్
దుబాయ్ వేదికగా మొదలుకానున్న ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కు భారీ అంచనాలు నెలకొన్నాయి. టోర్నీ ఆరంభమై వారం రోజులు కావొస్తున్నా.. దాయాది జట్ల మధ్య పోరుకు యావత్ ప్రపంచం.. . .

Harbhajan Singh
T20 World Cup 2021: దుబాయ్ వేదికగా మొదలుకానున్న ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కు భారీ అంచనాలు నెలకొన్నాయి. టోర్నీ ఆరంభమై వారం రోజులు కావొస్తున్నా.. దాయాది జట్ల మధ్య పోరుకు యావత్ ప్రపంచం ఎదురుచూస్తుంది. ఆదివారం జరిగే ఈ గేమ్ కు సంబంధించిన 12మంది టీంను ముందే ప్రకటించేసింది పాకిస్తాన్. కానీ, టీమిండియా మాత్రం ఇంకా జట్టును ప్రకటించకపోవడంతో ఆసక్తి పెరిగిపోతుంది.
ఇదిలా ఉంటే తుది జట్టు ఎలా ఉంటే బాగుంటుందో సీనియర్ క్రికెటర్ల నుంచి విలువైన సలహాలు అందుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా చేస్తున్న అనౌన్స్‌మెంట్‌లు వ్యూహరచనల్లో కీలక మార్పులకు కారణమవుతాయా అనే సందేహాలు పెంచుతున్నాయి. ఇందులో భాగంగానే వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ పాకిస్తాన్ తో మ్యాచ్ కు ముందు హార్దిక్ పాండ్యాను మర్చిపోవద్దంటున్నారు.
‘నేనే టీం మేనేజ్మెంట్‌లో భాగమై ఉంటే.. బ్యాటర్ గా తనను కచ్చితంగా తీసుకునే వాడిని. అతనికి ఆ సామర్థ్యం ఉంది. చివరిగా 2లేదా 3 లేదా 4బంతులు ఎన్ని ఉన్నా 10 నుంచి 12పరుగులు తీసుకురాగలడు. అతణ్ని జట్టులో ఉంచాలి. బౌలింగ్ పరంగానూ.. జడేజా, బుమ్రా, షమీ, చక్రవర్తి లాంటి సాలిడ్ బౌలర్లతో జట్టు పటిష్ఠంగా ఉంటుంది’ అని చెప్పుకొచ్చాడు హర్భజన్.
……………………………………….. : తైవాన్‌లో భారీ భూకంపం
హార్దిక్ పాండ్యాను రీప్లేస్ చేయాలంటే మరొకరంటూ లేరు. ఎందుకంటే 6లేదా 7వ పొజిషన్ లో ఆడాలంటే అందరూ సెట్ కాలేరు. 3వ స్థానంలో ఆడే సూర్య కుమార్ యాదవ్ ను 6 లేదా 7వ పొజిషన్ లో బ్యాటింగ్ చేయమంటే సడెన్ గా వచ్చిన మార్పును బ్యాలెన్స్ చేయలేకపోవచ్చు. ఈ అవకాశం వచ్చిన 10కి 8సార్లు పాండ్యా నిలబెట్టుకన్నాడు. చివరి రెండు బంతులు ఆడినా కనీసం ఒక్క సిక్స్ అయినా ఆడగలడు’ హర్భజన్ వెల్లడించాడు.