‘అతడికి కొత్త అల్లుడి ట్రీట్‌మెంట్ కావాలి..’ టీమిండియా యంగ్ ప్లేయర్‌పై కోచ్ గంభీర్.. ఆ ఆటగాడు ఎవరంటే..
కాగా, "ఎందుకు మీరు ఎప్పుడూ సీరియస్‌గా కనిపిస్తారు?" అని గంభీర్‌ని కపిల్ ప్రశ్నించాడు.

Gautam Gambhir
టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ చాలా గంభీరంగా ఉంటారని చాలా మంది అనుకుంటారు. ఆయనలో మరో కోణం కూడా దాగి ఉంది. తాజాగా అది బయటపడింది. కపిల్ శర్మ షో తాజా ఎపిసోడ్‌లో గౌతమ్ గంభీర్ పాల్గొని సరదాగా చేసిన కామెంట్లకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
భారత జట్టు ఆటగాళ్లు అభిషేక్ శర్మ, రిషబ్ పంత్, చాహల్‌తో కలిసి గంభీర్ ఈ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా “డిమాండింగ్ యాటిట్యూడ్ ఉన్న ఆటగాడు ఎవరు?” అని కపిల్ ప్రేక్షకులను అడిగాడు.
దీంతో ఓ వ్యక్తి స్పందిస్తూ.. “హార్దిక్ పాండ్యా అని అనుకుంటున్నా” అని చెప్పాడు. గంభీర్ దీనిపై స్పందిస్తూ.. “అతడికి అల్లుడి ట్రీట్‌మెంట్ కావాలి” అని సరదాగా చెప్పాడు. దీంతో అందరి పెదాల్లో చిరునవ్వులు పూశాయి.
కాగా, “ఎందుకు మీరు ఎప్పుడూ సీరియస్‌గా కనిపిస్తారు?” అని గంభీర్‌ని కపిల్ ప్రశ్నించాడు. గంభీర్ సమాధానం చెబుతూ.. “నా చుట్టూ ఉన్న వారు హ్యాపీగా ఉండడానికి నేను సీరియస్‌గా ఉంటాను. ఎవరో ఒకరు ఆ బాధ్యత తీసుకోవాలి” అని చెప్పారు.
ఈ మాటలు చూస్తే గంభీర్ మైండ్‌సెట్ స్పష్టమవుతుంది. టీమిండియాపై బాధ్యతగా ఫోకస్ పెట్టడం, జట్టు విజయమే గంభీర్ లక్ష్యమని అర్థమవుతోంది.
అంతేగాకుండా తాను పలు సందర్భాల్లో ఆగ్రహానికి గురైన ఘటనలపై గంభీర్ స్పందించారు. “మ్యాచుల్లో నేను గొడవలు చేస్తానని అంటారు. కానీ నేను ఎవరి కోసం గొడవ పడతాను? నా కోసం కాదు, దేశం కోసం మాత్రమే” అని స్పష్టం చేశారు.
Kapil Sharma and Gautam Gambhir talking about 𝘿𝘼𝙈𝘼𝘿 𝙏𝙔𝙋𝙀 𝘼𝙏𝙏𝙄𝙏𝙐𝘿𝙀 𝙊𝙁 𝙃𝘼𝙍𝘿𝙄𝙆😂👌🏻 pic.twitter.com/nKCZJ1uQ4Z
— BhaiSom33 (@HPstanno1) July 6, 2025