Hockey Player: హాకీ ప్లేయర్‌కు ధోతీ.. చొక్కా ఇచ్చి గౌరవించిన కేరళ ప్రభుత్వం
టోక్యో ఒలింపిక్స్ లో అసాధారణ ప్రతిభ చూపి ఏడు పతకాలతో తిరిగొచ్చారు మన అథ్లెట్లు. ఆయా సంస్థలు, శాఖలు పతక విజేతలను ప్రత్యేకంగా గౌరవిస్తున్నాయి. ఈ క్రమంలోనే కేరళ రాష్ట్రానికి చెందిన హాకీ గోల్ కీపర్ పరట్టు రవీంద్రన్ శ్రీజేశ్‌ను చేనేత పరిశ్రమల శాఖ ప్రత్యేకంగా సత్కరించనుంది.

Pr Sreejesh
Hockey Player: టోక్యో ఒలింపిక్స్ లో అసాధారణ ప్రతిభ చూపి ఏడు పతకాలతో తిరిగొచ్చారు మన అథ్లెట్లు. ఆయా సంస్థలు, శాఖలు పతక విజేతలను ప్రత్యేకంగా గౌరవిస్తున్నాయి. ఈ క్రమంలోనే కేరళ రాష్ట్రానికి చెందిన హాకీ గోల్ కీపర్ పరట్టు రవీంద్రన్ శ్రీజేశ్‌ను చేనేత పరిశ్రమల శాఖ ప్రత్యేకంగా సత్కరించనుంది.
మళయాలీ న్యూస్ మీడియా జన్మభూమిలో ప్రచురించిన కథనం ప్రకారం.. పరట్టు రవీంద్రన్ శ్రీజేశ్ ను మోస్ట్ ఇన్‌ఫ్లూయెన్షియల్ హాకీ ప్లేయర్ గా అభివర్ణించింది. అంతేకాకుండా ధోతీ, చొక్కా ఇవ్వడంతో పాటు వెయ్యి రూపాయల క్యాష్ టోకెన్ కూడా ఇస్తున్నట్లు ప్రకటించింది.
జర్మనీ జట్టును 5-4తేడాతో ఓడించిన హాకీ టీంలో శ్రీజేశ్ కూడా ఉన్నారు. హాకీ టీం సభ్యులకు పలు రాష్ట్రాలు రివార్డులు ప్రకటించాయి. కేరళ సీఎం పినరయి విజయన్ మాత్రం ఎటువంటి రివార్డును ప్రకటించకపోవడం గమనార్హం. కాకపోతే హ్యాండ్‌లూమ్ డిపార్ట్‌మెంట్ మాత్రం ధోతీ – చొక్కా ఇచ్చి సత్కరించాలని నిర్ణయించింది.