How can Lucknow Super Giants qualify for the IPL 2025 playoffs after defeat against PBKS
ఐపీఎల్ 2025 సీజన్‌లో లక్నోసూపర్ జెయింట్స్ ప్రయాణం పడుతూ లేస్తూ సాగుతోంది. ఆదివారం పంజాబ్ కింగ్స్ చేతిలో ఓడిపోవడంతో ఆ జట్టు ప్లేఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టం అయ్యాయి.
రిషబ్ పంత్ నాయకత్వంలో లక్నో ఇప్పటి వరకు 11 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 5 మ్యాచ్‌లో విజయం సాధించింది. మరో 6 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. 10 పాయింట్లు ఆ జట్టు ఖాతాలో ఉన్నాయి. నెట్‌రన్‌రేట్ -0.469గా ఉంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతోంది.
లక్నో ప్లేఆఫ్స్ చేరేందుకు అవకాశం ఉందా?
ఈ సీజన్‌లో లక్నో మరో మూడు మ్యాచ్‌లు మే 9న ఆర్‌సీబీతో, మే 14న గుజరాత్ టైటాన్స్‌తో, మే 18న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆడనుంది. ఈ మూడు మ్యాచ్‌ల్లోనూ లక్నో విజయం సాధిస్తే.. అప్పుడు ఆ జట్టు ఖాతాలో 16 పాయింట్లు ఉంటాయి. గత సీజన్లను బట్టి చూస్తే.. 16 పాయింట్లు సాధించిన జట్లు ప్లేఆఫ్స్‌కు చేరుకునేందుకు అవకాశాలు ఉన్నాయి.
రన్‌రేట్ మెరుగుపరచుకోవాలి..
ఈ మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించడం ఒక్కటే ముఖ్యం కాదు. లక్నోనెట్‌రన్‌రేట్ ప్రస్తుతం మైనస్‌లో ఉంది. కాబట్టి.. మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో భారీ విజయాలను సాధించాలి. అప్పుడే నెట్‌రన్‌రేట్‌ను మరింతగా మెరుగుపరచుకొవచ్చు. ఎందుకంటే.. ఒకవేళ మిగిలిన జట్లు కూడా 16 పాయింట్లతో సమంగా ఉంటే.. అప్పుడు నెట్‌రన్‌రేట్ కీలకంగా మారుతుంది.
ఒక్కటి ఓడిపోయినా..
మూడు మ్యాచ్‌ల్లో ఒక్కటి ఓడిపోయినా కూడా లక్నో.. ప్లేఆఫ్స్ చేరుకునే అవకాశం దాదాపుగా లేనట్లే. ఎందుకంటే ఇప్పటికే ఆర్‌సీబీ 16 పాయింట్లు, పంజాబ్ కింగ్స్ 15 పాయింట్లు, ముంబై, గుజరాత్ చెరో 14 పాయింట్లలతో టాప్-4లో ఉన్నాయి. ఈ జట్లు విజయం సాధించినా కూడా లక్నో కథ ముగినట్లే.