IPL 2024 : ఉప్పల్‌లో ఐపీఎల్ మ్యాచ్.. స్టేడియంకు వెళ్లేవారికి గుడ్ న్యూస్

ఐపీఎల్ 2024లో భాగంగా గురువారం సాయంత్రం ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.

IPL 2024 : ఉప్పల్‌లో ఐపీఎల్ మ్యాచ్.. స్టేడియంకు వెళ్లేవారికి గుడ్ న్యూస్

RCB vs SRH Match

SRH vs RCB : ఐపీఎల్ 2024లో భాగంగా గురువారం సాయంత్రం ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. డేంజరస్ బ్యాటింగ్ తో ప్రత్యర్థి బౌలర్లను వణికిస్తున్న హైదరాబాద్ జట్టు బెంగళూరుపై విజయం సాధించి ప్లే ఆప్స్ అవకాశాలను మెరుగుపర్చుకునేందుకు సన్నద్ధమవుతోంది. ఇప్పటికే వరుస ఓటములతో ప్లేఆఫ్స్ ఆశలను క్లిష్టతరం చేసుకున్న బెంగళూరు జట్టు.. హైదరాబాద్ జట్టుపై విజయం సాధించడం ద్వారా పరువు నిలుపుకోవాలని భావిస్తోంది. అయితే, పవర్ ప్లేలో బౌండరీల మోత మోగిస్తున్న హైదరాబాద్ బ్యాటర్లను.. బెంగళూరు జట్టు బౌలర్లు ఏ విధంగా కట్టడి చేస్తారన్న అంశం ఆసక్తికరంగా మారింది.

Also Read : IPL 2024 : పోరాడి ఓడిన గుజరాత్.. చెలరేగిన పంత్, అక్షర్ పటేల్.. 4 పరుగుల తేడాతో ఢిల్లీ విజయం

ఇప్పటి వరకు హైదరాబాద్, బెంగళూరు జట్లు 24 సార్లు తలపడగా.. హైదరాబాద్ 13 మ్యాచ్ లలో విజయం సాధించగా.. బెంగళూరు 10 మ్యాచ్ లలో మాత్రమే విజయం సాధించింది. ఒక మ్యాచ్ మాత్రం ఫలితం తేలలేదు. అయితే, ఉప్పల్ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుంది. హైదరాబాద్ జట్టు మొదట బ్యాటింగ్ చేస్తే గత రికార్డులను బ్రేక్ చేస్తుందా అనే అంశంసైతం అభిమానుల్లో ఉత్కంఠతను రేపుతుంది.

Also Read : IPL 2024 : బౌండరీ లైన్ వద్ద అద్భుత ఫీల్డింగ్‌తో ఢిల్లీ జట్టును గెలిపించిన ట్రిస్టాన్ స్టబ్స్.. వీడియో వైరల్

ఉప్పల్ వేదికగా సాయంత్రం 7.30 గంటల నుంచి మ్యాచ్ ప్రారంభమవుతుంది. రాత్రి 11.30 గంటల వరకు జరిగే అవకాశం ఉంటుంది. ఈ మ్యాచ్ ను నేరుగా స్టేడియంకు వెళ్లి చూసేందుకు టికెట్ల కోసం అభిమానులు అనేక పాట్లు పడ్డారు. అయితే, స్టేడియంలో మ్యాచ్ ను చూసేందుకు వెళ్లేవారికి హైదరాబాద్ మెట్రో గుడ్ న్యూస్ చెప్పింది. మ్యాచ్ సందర్భంగా మెట్రో రైళ్ల సమయాన్ని పొడిగించింది. ఉప్పల్ మెట్రో స్టేడియం నుంచి అర్ధరాత్రి 12.15 గంటలకు చివరిగా రైళ్లు బయలుదేరనున్నాయి. 1.10 గంటలకు ఇవి గమ్యస్థానాలకు చేరుకోనున్నాయి. ఆ సమయంలో ఉప్పల్ స్టేడియం – ఎన్జీఆర్ఐ స్టేషన్ లలో మాత్రమే మెట్రో ఎక్కేందుకు అనుమతించనున్నారు. ఉప్పల్ మార్గంలోని మిగతా స్టేషన్ లలో ప్రయాణికులు దిగేందుకు మాత్రమే వీలు కల్పించారు.