Champions Trophy: తీవ్ర ఒత్తిడిలోనూ సెంచరీ బాదిన ఇబ్రహీం జద్రాన్.. వారెవ్వా.. ఏం బ్యాటింగ్ చేశావ్‌ భయ్యా..

దూకుడుగా ఆడి 3 సిక్సులు, 6 ఫోర్ల సాయంతో 106 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకన్నాడు.

Champions Trophy: తీవ్ర ఒత్తిడిలోనూ సెంచరీ బాదిన ఇబ్రహీం జద్రాన్.. వారెవ్వా.. ఏం బ్యాటింగ్ చేశావ్‌ భయ్యా..

Ibrahim Zadran Pic: @ACBofficials

Updated On : February 26, 2025 / 5:32 PM IST

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా అఫ్ఘానిస్థాన్‌ – ఇంగ్లండ్‌ మధ్య మ్యాచ్‌ జరుగుతోంది. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో టాస్‌ నెగ్గిన అఫ్ఘానిస్థాన్‌ మొదట బ్యాటింగ్‌ ఎంచుకుని ఆడుతోంది.

అఫ్ఘాన్ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్ సెంచరీ బాదాడు. తోటి బ్యాటర్లు విఫలమవుతున్నప్పటికీ ఇబ్రహీం జఛాంపియన్స్ ట్రోఫీలోద్రాన్ దూకుడుగా ఆడి 3 సిక్సులు, 6 ఫోర్ల సాయంతో 106 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకన్నాడు. అఫ్ఘానిస్థాన్‌ నుంచి ఛాంపియన్స్ ట్రోఫీలో సెంచరీ బాదిన తొలి బ్యాటర్ అతడే. వన్డేల్లో అతడికి ఇది ఆరో సెంచరీ.

ఛాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్‌ బీలో సెమీస్ రేసులో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా ముందంజలో ఉన్నాయి. ఇంగ్లాండ్, అఫ్ఘానిస్థాన్‌ జట్లకు ఒక్క పాయింటు కూడా లేదు. ఇవాళ జరుగుతున్న మ్యాచులో ఓడిన జట్టు ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది. దీంతో ఇరు జట్లపై తీవ్ర ఒత్తిడి ఉంది. అందులోనూ తోటి బ్యాటర్లు విఫలం అవుతుంటే ఇబ్రహీం జద్రాన్ సెంచరీ చేసిన తీరు అద్భుతం.

రహ్మానుల్లా గుర్బాజ్‌ 6, అటల్ 4. రహ్మత్ షా 4, షాహిది 40 పరుగులు చేసి ఔటయ్యారు. క్రీజులో ఇబ్రహీం జద్రాన్‌కు అజ్మతుల్లా చక్కటి సహకారం అందించాడు. ఇబ్రహీం జద్రాన్ సెంచరీ చేసిన సమయంలో అఫ్ఘాన్‌ స్కోరు 201/4 (37 ఓవర్లకు)గా ఉంది.

అఫ్గానిస్థాన్‌ టీమ్‌: రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, అటల్, రహ్మత్, షాహిది, అజ్మతుల్లా , నబీ, గుల్బాదిన్ నైబ్, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఫజల్‌హక్ ఫరూఖి

ఇంగ్లండ్‌ టీమ్‌: ఫిల్‌ సాల్ట్, బెన్ డకెట్, జేమీ స్మిత్, జో రూట్, హ్యారీ బ్రూక్, బట్లర్, లివింగ్‌ స్టోం, జోఫ్రా ఆర్చర్, జేమీ ఓవర్టన్, అదిల్ రషీద్, మార్క్‌ వుడ్