Champions Trophy: పాక్‌, బంగ్లా మ్యాచ్‌ వర్షార్పణం.. ఇప్పుడు పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉన్న జట్లు ఏవో తెలుసా? నెక్స్ట్‌ ఏంటి?

పాకిస్థాన్‌ టీమ్‌పై పిడుగు మీద పిడుగు పడింది.

Champions Trophy: పాక్‌, బంగ్లా మ్యాచ్‌ వర్షార్పణం.. ఇప్పుడు పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉన్న జట్లు ఏవో తెలుసా? నెక్స్ట్‌ ఏంటి?

Updated On : February 27, 2025 / 6:53 PM IST

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ కథ ముగిసింది. ఒక్క గెలుపు కూడా లేకుండానే ఆ జట్లు ట్రోఫీ నుంచి నిష్క్రమించాయి. గురువారం ఆ రెండు జట్ల మధ్య జరగాల్సిన నామమాత్రపు మ్యాచు కూడా వర్షం కారణంగా రద్దయింది. 2017లో జరిగిన ఛాంపియన్స్‌ ట్రోఫీను నెగ్గిన పాకిస్థాన్‌ ఇప్పుడు మాత్రం పేలవ ప్రదర్శన కనబర్చింది.

తొలి రెండు మ్యాచుల్లో న్యూజిలాండ్, భారత్‌లో ఓడిపోయి లీగ్ దశలోనే బోల్తా పడింది. కనీసం బంగ్లాదేశ్‌తోనయినా గెలిచి విమర్శల నుంచి కాస్త ఉపశమనం పొందాలన్న కోరిక కూడా నెరవేరలేదు. బంగ్లాతో మ్యాచ్‌ టాస్ పడకుండానే క్యాన్సల్‌ అయింది. ఇవాళ రావల్పిండిలో మ్యాచ్‌ జరగాల్సి ఉండగా వర్షం కురిసింది. వాన ఎంతకీ తగ్గకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

Also Read: రూ.600 ఖర్చుతో 1,600 కి.మీ ప్రయాణం చేయొచ్చు.. మెచ్చుకోకుండా ఉండలేకపోయిన ఆనంద్‌ మహీంద్ర

ఏ జట్టు ఖాతాలో ఎన్ని పాయింట్లు?
గ్రూప్‌ ఏలో అగ్రస్థానంలో ఉన్న న్యూజిలాండ్‌ ఖాతాలో నాలుగు పాయింట్లు ఉన్నాయి. ఆ జట్టు రెండు మ్యాచులు ఆడి ఆ రెండింటిలోనూ గెలిచింది. భారత్‌ ఖాతాలోనూ నాలుగు పాయింట్లు ఉన్నాయి.

టీమిండియా కూడా రెండు మ్యాచులు ఆడి ఆ రెండింటిలోనూ గెలిచింది. బంగ్లాదేశ్ ఖాతాలో ఒకే ఒక్క పాయింట్ ఉంది. ఆ జట్టు మూడు మ్యాచులు ఆడి రెండింటిలో ఓడిపోయింది. పాకిస్థాన్ ఖాతాలోనూ ఒక్క పాయింట్ ఉంది. ఆ జట్టు మూడు మ్యాచులు ఆడి రెండు ఓడిపోయింది.

గ్రూప్‌ బీలో మూడు పాయింట్లతో దక్షిణాఫ్రికా అగ్రస్థానంలో ఉంది. ఆ జట్టు రెండు మ్యాచులు ఆడి ఒక మ్యాచ్ గెలిచింది. ఆస్ట్రేలియా ఖాతాలోనూ మూడు పాయింట్లు ఉన్నాయి. ఆ జట్టు రెండు మ్యాచులు ఆడి ఒకదాంట్లో విజయం సాధించింది.

అఫ్ఘానిస్థాన్ ఖాతాలో రెండు పాయింట్లు ఉన్నాయి. ఆ జట్టు రెండు మ్యాచులు ఆడి ఒక దాంట్లో గెలిచి, ఒక దాంట్లో ఓడిపోయింది. ఇంగ్లండ్ ఖాతాలో ఒక్క పాయింట్‌ కూడా లేదు. ఆ జట్టు రెండు మ్యాచులు ఆడి ఆ రెండింటిలోనూ ఓడిపోయింది.