AUS vs BAN: బంగ్లాదేశ్ పై ఆస్ట్రేలియా ఘన విజయం

బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బంగ్లాదేశ్ నిర్దేశించిన లక్ష్యాన్ని సులువుగానే ఛేదించింది.

AUS vs BAN: బంగ్లాదేశ్ పై ఆస్ట్రేలియా ఘన విజయం

icc cricket world cup 2023 today australia vs bangladesh match score and updates

Updated On : November 11, 2023 / 6:16 PM IST

బంగ్లాదేశ్ పై ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 307 పరుగుల లక్ష్యాన్ని 44.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి చేరుకుంది. మిచెల్ మార్ష్ సెంచరీ(177)తో చెలరేగాడు. వార్నర్(53), స్మిత్(63) హాఫ్ సెంచరీలు చేశారు.

సెంచరీ చేసిన మిచెల్ మార్ష్ 
ఆస్ట్రేలియా బ్యాటర్ మిచెల్ మార్ష్ సెంచరీ చేశాడు. 87 బంతుల్లో 11 ఫోరల్లు, 4 సిక్సర్లతో శతకం బాదాడు. వన్డేల్లో అతడికిది 3వ సెంచరీ. వార్నర్ 53 పరుగులు చేసి రెండో వికెట్ గా అవుటయ్యాడు. 31 ఓవర్లలో 192/2 స్కోరుతో ఆసీస్ ఆట కొనసాగిస్తోంది.

 

వార్నర్, మార్ష్ హాఫ్ సెంచరీలు
ఆస్ట్రేలియా బ్యాటర్లు డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ హాఫ్ సెంచరీలు చేశారు. వార్నర్ 51, మార్ష్ 61 పరుగులతో ఆడుతున్నారు. 20 ఓవర్లలో 123/1 స్కోరుతో ఆసీస్ ఆట కొనసాగిస్తోంది.

తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్
307 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 12 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. ట్రావిస్ హెడ్ 10 పరుగులు చేసి అవుటయ్యాడు. 6 ఓవర్లలో 38/1 స్కోరుతో ఆసీస్ ఆట కొనసాగిస్తోంది.

బంగ్లాదేశ్ భారీ స్కోరు.. ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే?
ఆస్ట్రేలియాకు బంగ్లాదేశ్ 307 పరుగుల టార్గెట్ పెట్టింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 306 పరుగులు చేసింది. తౌహిద్ హృదయ్ హాఫ్ సెంచరీతో రాణించాడు. 79 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 72 పరుగులు చేశాడు. నజ్ముల్ హొస్సేన్ శాంటో 45, తాంజిద్ హసన్ 36, లిట్టన్ దాస్ 36, మహ్మదుల్లా 32, మెహిదీ హసన్ మిరాజ్ 29, ముష్ఫికర్ రహీమ్ 21 పరుగులు సాధించారు. ఆసీస్ బౌలర్లలో అడమ్ జంపా, సీన్ అబాట్ రెండేసి వికెట్లు పడగొట్టారు. స్టొయినిస్ కు ఒక వికెట్ దక్కింది.

ముష్ఫికర్ అవుట్.. ఐదో వికెట్ డౌన్
251 పరుగుల వద్ద బంగ్లాదేశ్ ఐదో వికెట్ కోల్పోయింది. ముష్ఫికర్ రహీమ్ 21 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. 45 ఓవర్లలో 271/5 స్కోరుతో బంగ్లాదేశ్ ఆట కొనసాగిస్తోంది. తౌహిద్ హృదయ్ 68, మెహిదీ హసన్ మిరాజ్ 12 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.

మహ్మదుల్లా రనౌట్
214 పరుగుల వద్ద బంగ్లాదేశ్ 4వ వికెట్ నష్టపోయింది. మహ్మదుల్లా 32 పరుగుల చేసి రనౌటయ్యాడు. 40 ఓవర్లలో 239/4 స్కోరుతో బంగ్లాదేశ్ ఆట కొనసాగిస్తోంది.

నిలకడగా ఆడుతున్న బంగ్లాదేశ్
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేస్తున్న బంగ్లాదేశ్ 35 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 213 పరుగులు చేసింది. తాంజిద్ హసన్ 36, లిట్టన్ దాస్ 36, నజ్ముల్ హొస్సేన్ శాంటో 45 పరుగులు చేసి అవుటయ్యారు.

ODI World Cup-2023: ఐసీసీ వన్డే ప్రపంచకప్ లో భాగంగా శనివారం జరుగుతున్న 43 మ్యాచ్ లో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ జట్లు తలపడుతున్నాయి. పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఆస్ట్రేలియా ఇప్పటికే సైమీఫైనల్ చేరుకుంది. బంగ్లాదేశ్ కూడా ఈ మ్యాచ్ తర్వాత వరల్డ్ కప్ నుంచి నిష్క్రమిస్తుంది. దీంతో ఈ మ్యాచ్ నామమాత్రమే.

తుది జట్లు
బంగ్లాదేశ్: తాంజిద్ హసన్, లిట్టన్ దాస్, నజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), మహ్మదుల్లా, ముష్ఫికర్ రహీమ్ (వికెట్ కీపర్), తౌహిద్ హృదయ్, మెహిదీ హసన్ మిరాజ్, మహేదీ హసన్, నసుమ్ అహ్మద్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహమాన్

ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లాబుషాగ్నే, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), మార్కస్ స్టోయినిస్, సీన్ అబాట్, పాట్ కమిన్స్ (కెప్టెన్), ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్