END vs AUS : 33 ప‌రుగుల తేడాతో ఇంగ్లాండ్ పై ఆస్ట్రేలియా విజ‌యం

అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర మోదీ స్టేడియంలో ఇంగ్లాండ్ తో జ‌రిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఘ‌న విజయం సాధించింది

END vs AUS : 33 ప‌రుగుల తేడాతో ఇంగ్లాండ్ పై ఆస్ట్రేలియా విజ‌యం

END vs AUS

Updated On : November 4, 2023 / 10:19 PM IST

ఆస్ట్రేలియా విజ‌యం

287 ప‌రుగుల లక్ష్యంతో బ‌రిలోకి దిగిన ఇంగ్లాండ్ 48.1 ఓవ‌ర్ల‌లో 253 ప‌రుగుల‌కు ఆలౌటైంది. దీంతో ఆస్ట్రేలియా 33 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది.

లివింగ్ స్టోన్ ఔట్‌..
క‌మిన్స్ బౌలింగ్‌లో లివింగ్ స్టోన్ (2) ఔట్ అయ్యాడు. దీంతో ఇంగ్లాండ్ 174 ప‌రుగుల వ‌ద్ద ఆరో వికెట్ కోల్పోయింది. 37 ఓవ‌ర్ల‌కు ఇంగ్లాండ్ స్కోరు 174/6. అంత‌క‌ముందు జంపా బౌలింగ్‌లో స్టోయినిస్ క్యాచ్ అందుకోవ‌డంతో బెన్ స్టోక్స్ (64) పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు.

సిక్స‌ర్‌తో బెన్‌స్టోక్స్ హాఫ్ సెంచ‌రీ..
మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో సిక్స్ బాది 74 బంతుల్లో బెన్‌స్టోక్స్ హాఫ్ సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు. 32 ఓవ‌ర్ల‌కు ఇంగ్లాండ్ స్కోరు 146/4. బెన్‌స్టోక్స్ (61), మోయిన్ అలీ (13) లు ఆడుతున్నారు.

డేవిడ్ మ‌ల‌న్ హాఫ్ సెంచ‌రీ.. ఆ వెంట‌నే ఔట్‌..
క‌మిన్స్ బౌలింగ్‌లో సింగిల్ తీసి 63 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో హాఫ్ సెంచ‌రీ పూర్తి చేసుకున్న డేవిడ్ మ‌ల‌న్ ఆ మ‌రుస‌టి బంతికే హెడ్ క్యాచ్ అందుకోవ‌డంతో ఔట్ అయ్యాడు. 23 ఓవ‌ర్ల‌కు ఇంగ్లాండ్ స్కోరు 103 3. జోస్ బ‌ట్ల‌ర్ (0), బెన్‌స్టోక్స్ (35)లు ఆడుతున్నారు.

15 ఓవ‌ర్ల‌కు ఇంగ్లాండ్ స్కోరు 58/2
ఇంగ్లాండ్ బ్యాట‌ర్లు నిల‌క‌డ‌గా ఆడుతున్నారు. 15 ఓవ‌ర్ల‌కు ఇంగ్లాండ్ స్కోరు 58/2. డేవిడ్ మ‌ల‌న్ (29), బెన్‌స్టోక్స్ (12)లు ఆడుతున్నారు.

జో రూట్ ఔట్‌..
ఇంగ్లాండ్ మ‌రో వికెట్ కోల్పోయింది. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌ళో జో రూట్ (13) జోష్ ఇంగ్లిస్ చేతికి చిక్కాడు. దీంతో 4.3వ ఓవ‌ర్‌లో 19 ప‌రుగుల వ‌ద్ద రెండో వికెట్ కోల్పోయింది.

బెయిర్ స్టో డ‌కౌట్‌
ల‌క్ష్య‌ఛేద‌న‌లో ఆరంభంలోనే ఇంగ్లాండ్‌కు షాక్ త‌గిలింది. ఇన్నింగ్స్ మొద‌టి బంతికే బెయిర్ స్టో డ‌కౌట్ అయ్యాడు. మిచెల్ స్టార్క్ బౌలింగ్ లో జోష్ ఇంగ్లిస్ క్యాచ్ అందుకోవ‌డంతో ఔట్ అయ్యాడు. 4 ఓవ‌ర్ల‌కు ఇంగ్లాండ్ స్కోరు 19/1. జో రూట్ (13), డేవిడ్ మ‌ల‌న్ (3)లు ఆడుతున్నారు.

ఇంగ్లాండ్ టార్గెట్‌ 287
సెమీస్ చేరాలంటే త‌ప్ప‌క గెల‌వాల్సిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బ్యాట‌ర్లు త‌డ‌బ‌డినిల‌బ‌ట్టారు. టాస్ ఓడి మొద‌ట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 47.5 ఓవ‌ర్ల‌లో 286 ప‌రుగుల‌కు ఆలౌటైంది. ఆసీస్ బ్యాట‌ర్ల‌లో ల‌బుషేన్ (71; 83 బంతుల్లో 7 ఫోర్లు) హాఫ్ సెంచ‌రీ చేశాడు. కామెరూన్ గ్రీన్ (47; 52 బంతుల్లో 5 ఫోర్లు), స్టీవ్ స్మిత్ (44; 52 బంతుల్లో 3 ఫోర్లు),  మార్క‌స్ స్టోయినిస్ (35) లు రాణించారు. మిగిలిన వారు విఫ‌లం కావ‌డంతో ఆసీస్ ఓ మోస్త‌రు స్కోరుకే ప‌రిమిత‌మైంది. ఇంగ్లాండ్ బౌల‌ర్ల‌లో క్రిస్ వోక్స్ నాలుగు వికెట్లు ప‌డ‌గొట్టాడు. మార్క్ వుడ్, ఆదిల్ రషీద్ లు చెరో రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు. డేవిడ్ విల్లీ, లివింగ్ స్టోన్ లు ఒక్కొ వికెట్ సాధించారు.

ల‌బుషేన్ ఔట్‌..
ఆస్ట్రేలియా మ‌రో వికెట్ కోల్పోయింది. మార్క్‌వుడ్ బౌలింగ్‌లో ల‌బుషేన్ (71; 83 బంతుల్లో 7 ఫోర్లు) ఎల్బీడబ్ల్యూగా ఔట్ అయ్యాడు. దీంతో ఆస్ట్రేలియా 178 ప‌రుగుల వ‌ద్ద ఐదో వికెట్ కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది. 35 ఓవ‌ర్ల‌కు ఆస్ట్రేలియా స్కోరు 190/5. గ్రీన్ (37), స్టోయినిస్ (1) లు ఆడుతున్నారు.

ల‌బుషేన్ హాఫ్ సెంచ‌రీ..
ఆదిల్ ర‌షీద్ బౌలింగ్‌లో సింగిల్ తీసి 63 బంతుల్లో హాఫ్ సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు మార్న‌స్ ల‌బుషేన్‌. 26 ఓవ‌ర్ల‌కు ఆసీస్ స్కోరు 129/4. ల‌బుషేన్ (50), గ్రీన్ (1) లు ఆడుతున్నారు. అంత‌క ముందు ఆదిల్ ర‌షీద్ బౌలింగ్‌లో జోష్ ఇంగ్లిస్ (3) మొయిన్ అలీ క్యాచ్ అందుకోవ‌డంతో ఔట్ అయ్యాడు.

స్టీవ్ స్మిత్ ఔట్‌..
ఆదిల్ ర‌షీద్ బౌలింగ్‌లో స్టీవ్‌స్మిత్ (44; 52 బంతుల్లో 3 ఫోర్లు) మొయిన్ అలీ చేతికి చిక్కాడు. దీంతో 21.4వ ఓవ‌ర్‌లో 113 ప‌రుగుల వ‌ద్ద మూడో వికెట్ కోల్పోయింది. 22 ఓవ‌ర్ల‌కు ఆస్ట్రేలియా స్కోరు 114/3. మార్న‌స్ లబుషేన్ (38), జోష్ ఇంగ్లిస్ (1) లు ఆడుతున్నారు.

వార్న‌ర్ ఔట్‌..
ఆస్ట్రేలియా మ‌రో వికెట్ కోల్పోయింది. క్రిస్‌వోక్స్ బౌలింగ్‌లో డేవిడ్ వార్న‌ర్ (15) విల్లీ క్యాచ్ అందుకోవ‌డంతో ఔట్ అయ్యాడు. దీంతో 5.4వ ఓవ‌ర్‌లో 38 ప‌రుగుల‌ వ‌ద్ద ఆస్ట్రేలియా రెండో వికెట్ కోల్పోయింది.

ట్రావిస్ హెడ్ ఔట్‌..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు ఆరంభంలోనే గ‌ట్టి షాక్ త‌గిలింది. క్రిస్‌వోక్స్ బౌలింగ్‌లో ఓపెన‌ర్ ట్రావిస్ హెడ్ (11) రూట్ చేతికి చిక్కాడు. దీంతో 1.4వ ఓవ‌ర్‌లో 11 ప‌రుగుల వ‌ద్ద ఆస్ట్రేలియా మొద‌టి వికెట్ కోల్పోయింది.

ఇంగ్లాండ్ తుది జ‌ట్లు : జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్, జో రూట్, బెన్ స్టోక్స్, జోస్ బట్లర్(కెప్టెన్‌), మొయిన్ అలీ, లియామ్ లివింగ్‌స్టోన్, క్రిస్ వోక్స్, డేవిడ్ విల్లీ, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్

ఆస్ట్రేలియా తుది జ‌ట్టు : డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లాబుషాగ్నే, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీప‌ర్‌), కామెరాన్ గ్రీన్, మార్కస్ స్టోయినిస్, పాట్ కమిన్స్(కెప్టెన్‌), మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హాజిల్‌వుడ్

England vs Australia : వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో మ‌రో ఆస‌క్తిక‌ర పోరు జ‌రుగుతోంది. అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర మోదీ స్టేడియంలో ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి. ఈ మ్యాచ్‌లో విజ‌యం సాధించి సెమీస్ అవ‌కాశాల‌ను మ‌రింత మెరుగుప‌ర‌చుకోవాల‌ని ఆస్ట్రేలియా ఆరాట‌ప‌డుతోంది. ఇప్ప‌టికే సెమీస్ రేసు నుంచి నిష్ర్క‌మించిన ఇంగ్లాండ్ ఈ మ్యాచ్‌లో విజ‌యం సాధించి ఆస్ట్రేలియాకు షాక్ ఇవ్వ‌డంతో పాటు ప‌రువు ద‌క్కించుకోవాల‌ని భావిస్తోంది. ఈ క్ర‌మంలో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బ‌ట్ల‌ర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో ఆస్ట్రేలియా మొద‌ట బ్యాటింగ్ చేయ‌నుంది.