ENG vs PAK: 93 ప‌రుగుల తేడాతో ఇంగ్లాండ్ విజ‌యం

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో పాకిస్థాన్‌, ఇంగ్లాండ్ జట్ల క‌థ ముగిసింది.

ENG vs PAK: 93 ప‌రుగుల తేడాతో ఇంగ్లాండ్ విజ‌యం

icc cricket world cup 2023 today england vs pakistan match live score and updates

Updated On : November 11, 2023 / 9:38 PM IST

ఇంగ్లాండ్ విజ‌యం
338 ప‌రుగుల భారీ విజ‌య ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన పాకిస్థాన్ 43.3 ఓవ‌ర్ల‌లో 244 ప‌రుగుల‌కు ఆలౌటైంది. దీంతో ఇంగ్లాండ్ 93 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది.

మూడో వికెట్ నష్టపోయిన పాకిస్థాన్
63 పరుగుల వద్ద పాకిస్థాన్ మూడో వికెట్ నష్టపోయింది. కెప్టెన్ బాబర్ ఆజం 38 పరుగులు చేసి అవుటయ్యాడు. 17 ఓవర్లలో 74/2 స్కోరుతో పాకిస్థాన్ ఆట కొనసాగిస్తోంది.

10 పరుగులకే 2 వికెట్లు డౌన్
338 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ 10 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు అబ్దుల్లా షఫీక్(0), ఫఖర్ జమాన్(1) వెంటవెంటనే అవుటయ్యారు. 7 ఓవర్లలో 30/2 స్కోరుతో పాకిస్థాన్ ఆట కొనసాగిస్తోంది.

ముగిసిన ఇంగ్లండ్ బ్యాటింగ్.. పాకిస్థాన్ కు భారీ టార్గెట్
పాకిస్థాన్ కు ఇంగ్లండ్ 338 పరుగుల టార్గెట్ పెట్టింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 9 వికెట్లు కోల్పోయి 337 పరుగులు చేసింది.

భారీ స్కోరు దిశగా ఇంగ్లండ్
బెన్ స్టోక్స్, జో రూట్ హాఫ్ సెంచరీలతో ఇంగ్లండ్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. 40 ఓవర్లలో 240/2 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది. స్టోక్స్ 84, రూట్ 51 పరుగులతో ఆడుతున్నారు.

బెయిర్‌స్టో హాఫ్ సెంచరీ
ఇంగ్లండ్ ఓపెనర్ జానీ బెయిర్‌స్టో హాఫ్ సెంచరీ సాధించాడు. 52 బంతుల్లో 6 ఫోర్లు, సిక్సర్ తో అర్ధశతకం పూర్తి చేశాడు. 59 వ్యక్తిగత స్కోరు వద్ద రెండో వికెట్ గా అవుటయ్యాడు. 20 ఓవర్లలో 118/2 స్కోరుతో ఇంగ్లండ్ ఆట కొనసాగిస్తోంది. 25 ఓవర్లలో 140/2 స్కోరుతో ఇంగ్లండ్ ఆట కొనసాగిస్తోంది.

తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్
13.3 ఓవర్ లో 82 పరుగుల వద్ద ఇంగ్లండ్ తొలి వికెట్ కోల్పోయింది. డేవిడ్ మలన్ 31 పరుగులు చేసి ఇఫ్తికార్ అహ్మద్ బౌలింగ్ లో అవుటయ్యాడు. బెయిర్‌స్టో 40 పరుగులతో ఆడుతున్నాడు.

10 ఓవర్లలో ఇంగ్లండ్ 72/0
ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్న ఇంగ్లండ్ కు ఓపెనర్లు శుభారంభం అందించారు. మొదటి 10 ఓవర్లలో 72 పరుగుల స్కోరు సాధించారు. బెయిర్‌స్టో 34, డేవిడ్ మలన్ 27 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.

తొలి 5 ఓవర్లలో ఇంగ్లండ్ 26/0
టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్న ఇంగ్లండ్ మొదటి 5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా పరుగులు చేసింది. బెయిర్‌స్టో 15, డేవిడ్ మలన్ 5 పరుగులతో ఆడుతున్నారు.

టాస్ గెలిచిన ఇంగ్లండ్
ENG vs PAK: వన్డే ప్రపంచకప్ లో భాగంగా కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇంగ్లండ్ తో జరుగుతున్న కీలక మ్యాచ్ లో పాకిస్థాన్ చావోరేవో తేల్చుకోనుంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిస్తే తాము ఫస్ట్ బ్యాటింగ్ చేయాలనుకున్నామని పాక్ కెప్టన్ బాబర్ ఆజం అన్నాడు. పాకిస్థాన్ జట్టులో ఒక మార్పు జరిగింది. హసన్ అలీ స్థానంలో షాదాబ్ ఖాన్ వచ్చాడు.

 

తుది జట్లు
పాకిస్థాన్ : అబ్దుల్లా షఫీక్, ఫఖర్ జమాన్, బాబర్ ఆజం(కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్(వికెట్ కీపర్), సౌద్ షకీల్, ఇఫ్తీకర్ అహ్మద్, అఘా సల్మాన్, షాదాబ్ ఖాన్, షాహీన్ అఫ్రిది, మహ్మద్ వాసిం జూనియర్, హరీస్ రవూఫ్

ఇంగ్లండ్ : జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్, జో రూట్, బెన్ స్టోక్స్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(కెప్టెన్/వికెట్ కీపర్), మోయిన్ అలీ, క్రిస్ వోక్స్, డేవిడ్ విల్లీ, గుస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్