ICC Women’s World Cup : ప్రపంచకప్‌‌లో బోణీ కొట్టిన భారత్.. పాక్ పరాజయం, చుక్కలు చూపించిన రాజేశ్వరి

గతేడాది పురుషుల టీ20 ప్రపంచకప్‌లో చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌ చేతిలో ఎదురైన ఘోర పరాభవానికి భారత మహిళల జట్టు ప్రతీకారం తీర్చకుంది. మ‌హిళ‌ల వన్డే ప్రపంచక‌ప్‌లో భాగంగా

IND Women Won By 107 Runs : గతేడాది పురుషుల టీ20 ప్రపంచకప్‌లో చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌ చేతిలో ఎదురైన ఘోర పరాభవానికి భారత మహిళల జట్టు ప్రతీకారం తీర్చకుంది. మ‌హిళ‌ల వన్డే ప్రపంచక‌ప్‌లో భాగంగా 2022, మార్చి 06వ తేదీ ఆదివారం పాక్‌తో మ్యాచ్ జరిగింది. న్యూజిలాండ్‌లోని మౌంట్ మౌంగ‌నూయి వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో తొలుత నిర్ణీత 50 ఓవర్లలో భారత జట్టు 7 వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేధనకు బరిలోకి దిగిన పాక్ జట్టుకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. 43 ఓవర్లలో 137 పరులకు ఆలౌట్ అయ్యింది. దీంతో 107 రన్లతో భారత్ ఘన విజయం సాధించింది.

Read More : India vs Srilanka : రవీంద్ర జడేజా అద్భుత ప్రదర్శన.. లంక 174 పరుగులకు ఆలౌట్

Team India Women

పాక్ జట్టులో ఓపెనర్ సిద్రా అమీన్ 30 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచింది. భారత బౌలర్లు గతి తప్పకుండా బౌలింగ్ చేయడంతో పాక్ బ్యాట్స్ మెన్స్ అష్టకష్టాలు పడ్డారు. పరుగుల కోసం శ్రమించాల్సి వచ్చింది. వత్తిడిలో ఉండడంతో త్వరత్వరగా అవుట్ అయిపోయారు. రాజేశ్వరీ ఏకంగా నాలుగు వికెట్లు తీశారు. ఝులన్ గో స్వామి, స్నేహ్ రాణా రెండేసి వికెట్లు తీశారు. చివరకు 43 ఓవర్లలో 137 పరుగులకే అలౌట్ అయ్యింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత మహిళల మిడిల్ ఆర్డర్ ఫెయిల్ అయ్యింది. పాక్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొక చేతులేత్తేశారు. పటపటా వికెట్లు పడుతుండడంతో క్రికెట్ క్రీడాభిమానులు నిరుత్సాహానికి గురయ్యారు. ఓపెనర్ స్మృతి మందాన హాఫ్ సెంచరీతో కదం తొక్కగా.. దీప్తి 40 పరుగులతో రాణించారు. చివరిలో ఏడో బ్యాట్స్ మెన్ గా దిగిన స్నేహ్ రాణా, పూజా వస్త్రాకర్ 67 బ్యాట్ ఝులిపించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 244 పరుగులు చేసింది. వీరిద్దరూ నాటౌట్ గా క్రీజులో నిలిచారు. మొత్తంగా మహిళల టీమ్ ఇండియా జట్టు ప్రపంచకప్ లో బోణీ కొట్టింది.

Read More : Women’s World Cup : పాక్ టార్గెట్ 245.. భారత్ మిడిలార్డర్ ఫెయిల్.. రాణించిన మంధన

వార్మప్ మ్యాచ్‌ల్లో ద‌క్షిణాఫ్రికా, విండీస్‌లపై విజయాలు సాధించి ఫుల్‌ జోష్‌లో ఉన్న మిథాలీ సేన.. పాక్‌తో ఇవాళ జ‌రగబోయే మ్యాచ్‌లోనూ పైచేయి సాధించింది. భారత్‌ను ఓడించేందుకు బిస్మా మ‌హ‌రూఫ్ నేతృత్వంలోని పాక్‌ సైతం ఉవ్విళ్లూరినా అది నెరవేరలేదు. పాక్‌తో మ్యాచ్‌కు ముందు ఆటగాళ్లందరూ ఫిట్‌గా ఉండటమే కాకుండా మంచి ఫామ్‌లో ఉండడం భారత్‌కు కలిసొచ్చింది. మహిళల వన్డే క్రికెట్‌లో భారత్‌-పాక్‌లు ఇప్పటి వరకు 10 సందర్భాల్లో ఎదురెదురుపడగా, అన్ని సార్లు టీమిండియానే విజయం వరించింది. ఇందులో 3 విజయాలు ప్రపంచకప్ టోర్నీల్లో దక్కినవే. ఇక పొట్టి క్రికెట్‌లో ఇరు జట్లు తలపడిన 11 మ్యాచ్‌ల్లో టీమిండియా ఒక్కసారి మాత్రమే ఓడిపోయింది. తాజాగా మరోసారి పాక్ జట్టుపై గ్రాండ్ విక్టరీ కొట్టింది.

ట్రెండింగ్ వార్తలు