India vs Srilanka : రవీంద్ర జడేజా అద్భుత ప్రదర్శన.. లంక 174 పరుగులకు ఆలౌట్

భారత బౌలర్లు బాల్ తో విరుచుకపడ్డారు. గతి తప్పకుండా బంతులను విసురుతుండడంతో పటపటా వికెట్లు నేలకూలాయి. ఫలితంగా ప్రత్యర్థి జట్టు కష్టాల్లో పడిపోయింది. టీమిండియా - శ్రీలంక జట్ల...

India vs Srilanka : రవీంద్ర జడేజా అద్భుత ప్రదర్శన.. లంక 174 పరుగులకు ఆలౌట్

Team India Srilanka

India vs Srilanka 1st Test Match : భారత బౌలర్లు బాల్ తో విరుచుకపడ్డారు. గతి తప్పకుండా బంతులను విసురుతుండడంతో పటపటా వికెట్లు నేలకూలాయి. ఫలితంగా ప్రత్యర్థి జట్టు కష్టాల్లో పడిపోయింది. టీమిండియా – శ్రీలంక జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. 574 పరుగుల భారీ స్కోరు వద్ద భారత్ ఇన్నింగ్స్ ను డిక్లేర్డ్ చేసింది. శనివారం మిగిలిన ఆటలో శ్రీలంకను 108/4 కట్టడి చేసింది. ఆదివారం మ్యాచ్ ప్రారంభమైంది. రవీంద్ర జడేజా అత్యద్భుత ప్రదర్శన చేశాడు. ఏకంగా ఐదు వికెట్లు నేలకూల్చి శ్రీలంక నడ్డి విరిచాడు.

Read More : Women’s World Cup : పాక్ టార్గెట్ 245.. భారత్ మిడిలార్డర్ ఫెయిల్.. రాణించిన మంధన

తొలి ఇన్నింగ్స్ లో 174 పరుగులకు ఆలౌట్ అయ్యింది. నిశాంక 61 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. మిగతా బ్యాట్స్ మెన్స్ తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. ఓవర్ నైట్ బ్యాట్స్ మెన్ నిశాంక (26), అసలంక (1) ఆటను ఆరంభించారు. వీరిద్దరూ జాగ్రత్త పడుతూ ఆడారు. టీమిండియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ వికెట్ తీసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే నిశాంక హాఫ్ సెంచరీ సాధించి మంచి ఊపు మీదన్నట్లు కనిపించాడు. ఇతనికి చక్కటి సహకారం అందిస్తూ వచ్చిన అసలంక (29) బుమ్రా బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.

Read More : Women’s World Cup : పాక్ టార్గెట్ 245.. భారత్ మిడిలార్డర్ ఫెయిల్.. రాణించిన మంధన

ఇతను అవుట్ అయిన తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. రవీంద్ర జడేజా వేసిన 61 ఓవర్ లో డిక్ విల్లా (2), లక్మల్ (0) వెనుదిరిగారు. దీంతో శ్రీలంక జట్టు ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిపోయింది. అప్పటికీ ఆ జట్టు స్కోరు 164 పరుగులు మాత్రమే. లాసిత్, ఫెర్నాండో, కుమారలు ఏమి పరుగులు చేయకుండానే అవుట్ అయ్యారు. నిశాంక ఒక్కడే అర్ధసెంచరీ సాధించాడు. ఇతను 61 పరుగులు చేసి నౌటౌట్ గా నిలిచాడు. మొత్తంగా లంక జట్టు 174 పరుగులకు ఆలౌట్ కావడంతో భారత్ కు తొలి ఇన్నింగ్స్ లో 400 పరుగుల సంపూర్ణ ఆధిక్యం లభించింది.