ODI World Cup : ప్రపంచకప్‌కు జట్టును ప్రకటించిన నెదర్లాండ్స్.. తెలుగు కుర్రాడికి చోటు..!
భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్(ODI World Cup)లో పాల్గొనే జట్లు అన్ని ఒక్కొక్కటిగా తమ టీమ్‌లను ప్రకటిస్తున్నాయి. తాజాగా నెదర్లాండ్స్ (Netherlands) క్రికెట్ బోర్డు తమ జట్టును వెల్లడించింది.

Netherlands Announce 15 Man Squad For World Cup
ODI World Cup 2023 : భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్(ODI World Cup)లో పాల్గొనే జట్లు అన్ని ఒక్కొక్కటిగా తమ టీమ్‌లను ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే టీమ్ఇండియా, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా వంటి జట్లు తమ టీమ్‌లను ప్రకటించగా తాజాగా నెదర్లాండ్స్ (Netherlands) క్రికెట్ బోర్డు తమ జట్టును వెల్లడించింది. 15 మంది ప్లేయర్లతో కూడిన జాబితాను ప్రకటించింది. వీరితో పాటు మరో ఇద్దరు ఆటగాళ్లను రిజర్వు ప్లేయర్లుగా ఎంపిక చేసింది. నెదర్లాండ్స్ బృందానికి స్కాట్ ఎడ్వర్డ్స్(Scott Edwards) నాయకత్వం వహించనున్నాడు. ఈ జట్టులో తెలుగు మూలాలు ఉన్న తేజ నిడమనూరుకు చోటు దక్కింది.
ఇటీవల జింబాబ్వే వేదికగా జరిగిన వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ టోర్నీలో నెదర్లాండ్స్ జట్టు బాగా ఆడి ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. స్కాట్లాండ్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో 44 ఓవర్లలో 278 లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉండగా బాస్ డి లీడే సూపర్ శతకం సాధించడంతో మరో ఏడు బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించి వరల్డ్ కప్ బెర్తును సొంతం చేసుకుంది. ఈ టోర్నీలో రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన వెస్టిండీస్ జట్టును సూపర్ ఓవర్‌లో ఓడించింది నెదర్లాండ్స్. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో తేజ నిడమనూరు సెంచరీతో చెలరేగాడు.
ప్రపంచకప్‌కు నెదర్లాండ్ జట్టు ఇదే..
స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్), మాక్స్ ఓ డౌడ్, బాస్ డి లీడె, విక్రం సింగ్, తేజ నిడమనూరు, పౌల్ వాన్ మీకెరెన్, వాన్ డెర్ మెర్వే, కొలిన్ అక్రెమన్, లొగాన్ వాన్ బీక్, అర్యన్ డట్, రియాన్ క్లెయిన్, వెస్లే బరేసి, సకిబ్ జుల్ఫికర్, షరిజ్ అహ్మద్, సిబ్రాండ్ ఎంగెల్‌బ్రెంచెట్.
అక్టోబర్ 5 నుంచి నవంబర్ 15 వరకు భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ జరగనుంది. ఈ మెగా టోర్నీలో నెదర్లాండ్స్ తన తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో తలపడనుంది. అక్టోబర్ 6న జరగనున్న ఈ మ్యాచ్‌కు హైదరాబాద్ వేదిక కానుంది. ఇక భారత జట్టును నవంబర్ 11న నెదర్లాండ్ ఢీ కొట్టనుంది.
విజయవాడలో పుట్టిన తేజ..
తేజ నిడమనూరు పూర్తి పేరు అనిల్ తేజ నిడమనూరు. 1994 ఆగస్టు 22న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో జన్మించాడు. తేజకు ఏడేళ్ల యవస్సు ఉన్నప్పుడు అతడి కుటుంబం న్యూజిలాండ్‌కు వెళ్లింది. న్యూజిలాండ్‌లో పాఠశాలలో చదువుతున్న సమయంలో అతడికి రగ్భీ గేమ్ అంటే ఇష్టం ఏర్పడింది. అయితే.. అనుకోకుండా అతడు క్రికెట్ వైపు వచ్చాడు. ఆక్లాండ్ సీనియర్ టీమ్‌లో ఆడాడు. న్యూజిలాండ్ టీమ్‌లో అవకాశం దొరకడం కష్టం అని బావించిన తేజ నెదర్లాండ్స్‌కు వెళ్లాడు. అక్కడ తన ప్రతిభతో నెదర్లాండ్స్ జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. తన అరంగ్రేటం మ్యాచులో అర్థశతకంతో రాణించాడు. అప్పటి నుంచి నెదర్లాండ్స్ జట్టులో కీలక సభ్యుడిగా మారి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు.
Asia Cup 2023 : మ్యాచ్ మధ్యలో ఆగిన ఫ్లడ్ లైట్లు.. టోర్నీ మొత్తం చీకట్లోనే ఆడించేవాళ్లా..?
The 15 men who will represent The Netherlands in the #CWC23 starting next month.
Wicketkeeper Batter Noah Croes and Fast Bowler Kyle Klein will be the two travelling reserves in the squad.
??, here we come! ? pic.twitter.com/bTXvVzdZPM
— Cricket?Netherlands (@KNCBcricket) September 7, 2023