IND vs PAK : క్రికెట్ అభిమానులకు పండగే.. 15 రోజుల వ్యవధిలో మూడు సార్లు తలపడనున్న భారత్, పాక్..!
భారత్, పాక్ మ్యాచ్ చూడాలనే వారికి శుభవార్త.

In 2025 Asia cup India and pakistan may 3 times clash
ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల కారణం చాలా కాలంగా భారత్, పాకిస్తాన్ జట్లు ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే ఈ రెండు దేశాలు తలపడుతున్నాయి. భారత్, పాక్ జట్లు తలపడుతున్నాయంటే కేవలం ఇరు దేశాల అభిమానులే కాదు.. యావత్త్ క్రికెట్ అభిమానులు సైతం మ్యాచ్‌ను వీక్షిస్తుంటారు. ఇరు దేశాలు ఇటీవల ఛాంపియన్స్ టోఫ్రీ 2025లో ఫిబ్రవరి 23న దుబాయ్ వేదికగా తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. ఆతిథ్య పాకిస్తాన్ రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోవడంతో ఈ టోర్నీ నుంచి నిష్ర్కమించింది.
దీంతో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో భారత్, పాక్ వీక్షించాలని అనుకున్న అభిమానులకు నిరాశే ఎదురైంది. కాగా.. ఇప్పుడు ఓ శుభవార్త అందుతోంది. ఈ ఏడాది ఆసియా కప్‌ను నిర్వహించనున్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్ జట్లు ఒక్క సారి కాదు మూడు సార్లు తలడే అవకాశాలు ఉన్నాయి.
ఆసియా కప్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో నిర్వహించాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) నిర్ణయం తీసుకున్నట్లుగా క్రిక్‌బజ్ తెలిపింది. ఈ టోర్నమెంట్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే.. పాక్ ఆడే మ్యాచ్‌లు మాత్రం యూఏఈ లేదా శ్రీలంకలో జరగవచ్చు. ఎందుకంటే భద్రతా కారణాల దృష్ట్యా పాక్‌లో పర్యటించం అని బీసీసీఐ ఛాంపియన్స్ ట్రోఫీ2025కి ముందు ఐసీసీకి తెలియజేసింది.
ఈ క్రమంలో 2027 వరకు జరిగే భారత్, పాక్ ఆతిథ్యం ఇచ్చే ఐసీసీ టోర్నీల్లో ఇరు దేశాలు తట్టస్థ వేదికల్లో ఆడతాయని ఐసీసీ తెలిపింది. ఇప్పుడు భారత్ ఎలాగైతే దుబాయ్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ ఆడుతుందో అలాగే పాక్.. యూఏఈ లేదా శ్రీలంక వేదికగానే ఆసియా కప్ మ్యాచ్‌లను ఆడనుంది.
మూడు సార్లు ఎలాగంటే?
2026లో టీ20 ప్రపంచకప్ జరగనున్న తరుణంలో ఆసియా కప్‌ను టీ20 ఫార్మాట్‌లో నిర్వహించనున్నట్లుగా తెలుస్తోంది. మొత్తం 8 జట్లు భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్, ఒమన్, యూఏఈ, హంకాంగ్ లు ఆసియాకప్ బరిలో ఉన్నాయి.
వీటిని రెండు గ్రూపులు విభజిస్తారు. భారత్, పాక్ లను మాత్రం ఖచ్చితంగా ఒకే గ్రూపులో ఉంచుతారు. ఈ క్రమంలో గ్రూప్ స్టేజీలో భారత్, పాక్ ఓ సారి తలపడనున్నాయి. రెండు జట్లు తదుపరి రౌండ్ సూపర్-4 అర్హత సాధిస్తే అక్కడ మరోసారి తలపడొచ్చు. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిస్తే.. అప్పుడు ఫైనల్‌లోనూ భారత్, పాక్ మ్యాచ్‌లు జరగనున్నాయి.
సెప్టెంబర్ రెండో వారం నుంచి నాలుగో వారం వరకు నిర్వహించాలని, మొత్తం 19 మ్యాచ్‌లు నిర్వహించనున్నట్లుగా తెలుస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ ముగిసిన తరువాత ఆసియా కప్ 2025 షెడ్యూల్‌ను విడుదల చేసే అవకాశం ఉంది.