IND vs NZ : న్యూజిలాండ్‌తో మ్యాచ్.. కోహ్లీకి ఎంతో ప్రత్యేకం.. ఈ జన్మలో మరిచిపోలేడు.. ఎందుకో తెలుసా?
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా భారత్, న్యూజిలాండ్ జట్లు మార్చి 2న తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు కోహ్లీకి ఎంతో ప్రత్యేకం కానుంది.

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ అదరగొడుతోంది. వరుసగా బంగ్లాదేశ్, పాకిస్తాన్‌లను ఓడించి సెమీస్‌కు చేరుకుంటుంది. గ్రూప్ స్టేజీలో మరో మ్యాచ్ భారత్ ఆడాల్సింది. మార్చి 2న దుబాయ్ వేదికగా న్యూజిలాండ్‌తో టీమ్ఇండియా తలపడనుంది. భారత్, న్యూజిలాండ్‌లు ఇప్పటికే సెమీస్‌కు చేరడంతో ఈ మ్యాచ్ నామమాత్రంగా మారింది. అయితే.. ఈ మ్యాచ్‌కు పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీకి ఎంతో ప్రత్యేకంగా నిలిచిపోనుంది. ఎందుకంటే వన్డేల్లో కోహ్లీకి ఇది 300వ మ్యాచ్.
2008లో వన్డేల ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లీ అడుగుపెట్టాడు. విరాట్ ఇప్పటి వరకు 299 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. 287 ఇన్నింగ్స్‌ల్లో 58.2 సగటుతో 14085 పరుగులు సాధించాడు. ఇందులో 51 శతకాలు 73 అర్థశతకాలు ఉన్నాయి. వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు కోహ్లీ పేరిటే ఉంది. అంతేకాకుండా వన్డేల్లో 50 సెంచరీలు చేసిన తొలి ప్లేయర్‌గా కోహ్లీ నిలిచాడు.
KL Rahul : ఎంత మాటన్నావ్ రాహుల్.. విరాట్ కోహ్లీ, ధోనీలు కాదా.. ఆ విషయంలో రోహిత్ శర్మే తోపా?
వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ మూడో స్థానంలో ఉన్నాడు. 18,426 పరుగులతో ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉన్నాడు. శ్రీలంక దిగ్గజ ఆటగాడు కుమార సంగక్కర 14,234 పరుగులతో రెండో స్థానంలో నిలిచాడు. కోహ్లీ మరో 150 పరుగులు చేస్తే వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా రికార్డులకు ఎక్కుతాడు. తన కెరీర్‌లో మైల్‌స్టోన్ మ్యాచ్ అయిన కివీస్‌తో మ్యాచ్‌లో కోహ్లీ భారీ శతకంతో చెలరేగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
ఇక 123 టెస్టుల్లో, 125 టీ20 మ్యాచ్‌ల్లోనూ కోహ్లీ భారత్‌కు ప్రాతినిథ్యం వహించాడు. 123 టెస్టుల్లో 46.9 సగటుతో 9,230 పరుగులు సాధించాడు. ఇందులో 30 సెంచరీలు, 31 అర్థశతకాలు ఉన్నాయి. 125 టీ20 మ్యాచ్‌ల్లో 48.7 సగటుతో 4188 పరుగులు చేశాడు. ఇందులో ఓ శతకం, 38 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ఇక ఐపీఎల్ విషయానికి వస్తే.. ఐపీఎల్ ఆరంభం నుంచి కోహ్లీ ఆడుతున్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు మాత్రమే కోహ్లీ ఆడుతున్నాడు. 252 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 38.7 సగటుతో 8004 పరుగులు చేశాడు. ఇందులో 8 సెంచరీలు 55 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.