IND vs ENG 1st test do you know What is the highest successful chase at Headingley Tests
హెడింగ్లీ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ముందు భారత్ 371 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఈ టార్గెట్‌ను ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లాండ్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. బెన్ డకెట్ (9), జాక్ క్రాలీ (12)లు క్రీజులో ఉన్నారు. ఇంగ్లాండ్ విజయానికి ఆఖరి రోజు 350 పరుగులు అవసరం కాగా.. భారత్ 10 వికెట్లు తీస్తే గెలుస్తుంది.
ఈ క్రమంలో ఇప్పుడు అందరి దృష్టి హెడింగ్లీలో ఇప్పటి వరకు అత్యధిక లక్ష్యం ఎంత? ఆ టార్గెట్‌ను ఛేదించిన జట్టు ఏదీ వంటి వాటిపై పడింది. హెడింగ్లీలో అత్యధిక విజయవంతమైన లక్ష్య ఛేదన 404 పరుగులు. దీన్ని ఇంగ్లాండ్ జట్టు పై ఆస్ట్రేలియా ఛేదించింది. 1948లో యాషెస్ సిరీస్‌లో ఆసీస్ ఈ లక్ష్యాన్ని ఛేదించింది. అప్పటి ఆసీస్ కెప్టెన్, లెజెండ్ డాన్ బ్రాడ్‌మన్ 173 పరుగులతో నాటౌట్ నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో ఆసీస్ ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది.
ENG vs IND : ఐదో రోజు ఆటకు వర్షం ముప్పు.. పాపం ఇంగ్లాండ్.. గెలుద్దామనుకుంటే..
ఇక రెండో అత్యధిక లక్ష్య ఛేదన ఇంగ్లాండ్ పేరిట ఉంది. 2019లో యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆసీస్ పై 359 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ ఛేదించింది. ప్రస్తుత కెప్టెన్ బెన్‌స్టోక్స్ 135 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌తో ఇంగ్లాండ్‌కు నమ్మశక్యంగానీ విజయాన్ని అందించాడు. అతడు ఆఖరి వికెట్ జాక్ లీచ్‌తో కలిసి 76 పరుగుల అజేయ భాగస్వామ్యంతో జట్టును గెలిపించాడు.
టెస్టుల్లో హెడింగ్లీలో అత్యధిక విజయవంతమైన లక్ష్య ఛేదనలు ఇవే..
* 1948లో ఇంగ్లాండ్‌పై ఆస్ట్రేలియా – 404 పరుగులు
* 2019లో ఆస్ట్రేలియాపై ఇంగ్లాండ్ – 359 పరుగులు
* 2017లో ఇంగ్లాండ్‌పై వెస్టిండీస్ – 322 పరుగులు
* 2001లో ఆస్ట్రేలియాపై ఇంగ్లాండ్ – 315 పరుగులు
* 2022లో న్యూజిలాండ్‌పై ఇంగ్లాండ్ – 296 పరుగులు
భారత్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో గెలిచి 1-0 ఆధిక్యంలోకి వెళ్లాలని అనుకుంటున్న ఇంగ్లాండ్ హెడింగ్లీలో రెండో అత్యధిక భారీ లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉంటుంది.