ENG vs IND : ఐదో రోజు ఆటకు వర్షం ముప్పు.. పాపం ఇంగ్లాండ్.. గెలుద్దామనుకుంటే..
హెడింగ్లీ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ ఆసక్తికరంగా మారింది.

ENG vs IND 1st test Headingley Day 5 Weather Report
హెడింగ్లీ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. 371 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ కోల్పోకుండా 21 పరుగులు చేసింది. క్రీజులో బెన్ డకెట్ (9), జాక్ క్రాలీ (12)లు ఉన్నారు. ఇంగ్లాండ్ విజయానికి ఆఖరి రోజు 350 పరుగులు అవసరం కాగా.. భారత గెలుపుకు 10 వికెట్లు కావాలి.
ఇంగ్లాండ్ బజ్‌బాల్ ఆడుతుండడంతో లక్ష్యాన్ని ఛేదించేందుకు మొగ్గు చూపుతుందన్న దానిలో ఎలాంటి సందేహం లేదు. ఇంగ్లీష్ బ్యాటర్లు తలుచుకుంటే 90 ఓవర్లలో 350 పరుగులు పెద్ద కష్టమేం కాదు.. అయితే.. మ్యాచ్ ఆఖరి రోజుకు వరుణుడు అంతరాయం కలిగించే అవకాశ ఉంది.
Dilip Doshi : భారత క్రికెట్‌లో తీవ్ర విషాదం.. గుండెపోటుతో మాజీ ఆటగాడు దిలీప్ దోషి కన్నుమూత
అక్యూవెదర్ ప్రకారం స్థానిక కాలమానం ప్రకారం హెడింగ్లీలో మంగళవారం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల మధ్య వర్షం పడే అవకాశం దాదాపుగా 60 శాతం ఉంది. ఇక మధ్యాహ్నం 2 గంటల సమయంలో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది. ఆ తరువాత ఎలాంటి వర్షం ముప్పు లేదు. అయితే.. వర్షం వల్ల కొన్ని ఓవర్ల ఆటను నష్టపోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సీమింగ్ కండిషన్లు ఉంటే అది భారత్‌కు అడ్వాంటేజ్‌గా మారుతుంది.
తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లతో సత్తా చాటిన జస్‌ప్రీత్ బుమ్రా రెండో ఇన్నింగ్స్‌లో అలాంటి ప్రదర్శననే నమోదు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.