IND vs ENG : వన్డే సిరీస్ ప్రారంభానికి ముందే ఇంగ్లాండ్‌కు భారీ షాక్..!
వన్డే సిరీస్ ప్రారంభం కాకముందే ఇంగ్లాండ్‌కు భారీ షాక్ తగిలింది.

IND vs ENG England wicketkeeper Jamie Smith likely to miss first two ODIs Reports
టీమ్ఇండియాతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఇంగ్లాండ్ 4-1తో కోల్పోయింది. ఈ క్రమంలో ఫిబ్రవరి 6 నుంచి ప్రారంభం కానున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో విజయం సాధించాలని ఇంగ్లాండ్ భావిస్తోంది. అయితే.. తొలి వన్డేకు ముందే ఆ జట్టుకు గట్టి షాక్ తగిలింది. ఆ జట్టు వికెట్‌కీపర్ బ్యాటర్ జామీ స్మిత్ వన్డే సిరీస్‌లోని తొలి రెండు వన్డేలకు దూరం కానున్నాడని తెలుస్తోంది. ఈ మేరకు మీడియాలో కథనాలు వస్తున్నాయి.
భారత్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో స్మిత్ ఆడాడు. మూడో టీ20 మ్యాచ్‌లో అతడి కాలికి గాయమైంది. దీంతో టీ20 సిరీస్‌లోని చివరి రెండు మ్యాచ్‌ల్లో అతడు బరిలోకి దిగలేదు. అతడి స్థానంలో జాకబ్ బెథెల్ ఆడాడు. ఇక వన్డే సిరీస్ వరకు స్మిత్ కోలుకుంటాడని ఇంగ్లాండ్ జట్టు మేనేజ్‌మెంట్ తెలిపింది. అయితే.. రేపటి నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుండగా ఇంకా అతడు కోలుకోలేదు. దీంతో అతడు వన్డే సిరీస్‌లో తొలి రెండు వన్డేలకు దూరం కానున్నట్లు తెలుస్తోంది.
Rahul Dravid : బెంగళూరులోని రద్దీ రోడ్డు పై ఆటో డ్రైవర్‌తో ద్రవిడ్ గొడవ.. వీడియో వైరల్
దీనిపై ఇంగ్లాండ్ జట్టు ఇప్పటి వరకు అయితే ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇంగ్లాండ్ మేనేజ్‌మెంట్ ఎలాంటి రిస్క్ తీసుకోవద్దని భావిస్తున్నట్లుగా సమాచారం. స్మిత్ దూరం అయితే.. వన్డేల్లో వికెట్ కీపింగ్ బాధ్యతలను ఎవరు నిర్వర్తిస్తారన్నది ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది.
కెప్టెన్ జోస్ బట్లర్‌తో పాటు ఫిల్ సాల్ట్ లు వికెట్ కీపింగ్ చేయగల సమర్థులు. అయితే.. గాయం నుంచి కోలుకున్న తరువాత బట్లర్ ఇప్పటి వరకు వికెట్ కీపింగ్ బాధ్యతలను తీసుకోలేదు. మరోవైపు పొట్టి ఫార్మాట్‌లో మంచి వికెట్ కీపర్‌గా గుర్తింపు తెచ్చుకున్న సాల్ట్ కు వన్డేల్లో పెద్దగా అనుభవం లేదు.
భారత్, ఇంగ్లాండ్ జట్లకు ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇదే చివరి వన్డే సిరీస్. ఈ క్రమంలో ఈ సిరీస్‌లో సత్తా చాటి ఛాంపియన్స్ ట్రోఫీకి ఆత్మవిశ్వాస్యంతో వెళ్లాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. ఈ క్రమంలో మ్యాచ్‌లు హోరాహోరీగా జరిగే అవకాశం ఉంది. సీనియర్ ఆటగాడు జో రూట్ చేరికతో ఇంగ్లాండ్ బలం రెట్టింపైంది.
వన్డే సిరీస్ షెడ్యూల్ ఇదే..
తొలి వన్డే.. ఫిబ్రవరి 6న – నాగ్‌పూర్
రెండో వన్డే – ఫిబ్రవరి 9న -కటక్
మూడో వన్డే – అహ్మదాబాద్ – అహ్మదాబాద్
భారత కాలమానం ప్రకారం ఈ మూడు వన్డేలు మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం కానున్నాయి.
భారత్‌తో వన్డే సిరీస్‌కు ఇంగ్లాండ్ జట్టు ఇదే..
జోస్ బట్లర్ (కెప్టెన్), హ్యారీ బ్రూక్, బెన్ డకెట్, జో రూట్, ఫిలిప్ సాల్ట్, జామీ స్మిత్, జాకబ్ బెథెల్, బ్రైడాన్ కార్స్, లియామ్ లివింగ్‌స్టోన్, జామీ ఓవర్టన్, జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, సాకిబ్ మహమూద్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్.