IND vs NZ: గుడ్‌న్యూస్‌.. ఫైనల్‌ మ్యాచు జరిగేలా కరుణ చూపుతున్న వరుణుడు.. మ్యాచ్‌ టై అయితే ఏం చేస్తారో తెలుసా?

ఫైనల్‌ మ్యాచుకు భారత్‌, న్యూజిలాండ్ సిద్ధమవుతున్నాయి.

IND vs NZ: గుడ్‌న్యూస్‌.. ఫైనల్‌ మ్యాచు జరిగేలా కరుణ చూపుతున్న వరుణుడు.. మ్యాచ్‌ టై అయితే ఏం చేస్తారో తెలుసా?

PC: ANI

Updated On : March 7, 2025 / 7:19 PM IST

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఆదివారం భారత్‌, న్యూజిలాండ్ ఫైనల్‌ మ్యాచులో తలపడనున్నాయి. దుబాయ్‌ వేదికగా జరిగే ఈ మ్యాచుకు వర్షం ముప్పు ఉంటుందా? అన్న సందేహాలు అభిమానుల్లో ఉన్నాయి.

అయితే, దుబాయ్‌ వెదర్ రిపోర్టు ప్రకారం ఆదివారం వర్షాలు పడే అవకాశాలు లేవని తెలిసింది. దీంతో ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు. మ్యాచ్‌ ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరిగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెప్పడంతో మ్యాచ్‌ కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

Also Read: దేశ చరిత్రలో మొట్టమొదటిసారి.. మోదీకి 2,300 మంది మహిళా పోలీసులతో భద్రత.. ఎందుకంటే?

మ్యాచ్‌ టై అయితే?
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌ మ్యాచు ఒకవేళ టై అయితే ఏం చేస్తారో తెలుసా? భారత్‌, న్యూజిలాండ్‌ రెండు జట్లు ఒకేలా స్కోరు చేస్తే.. సూపర్‌ ఓవర్‌ ఉంటుంది. ఒకవేళ ఈ సూపర్ ఓవర్‌ కూడా టై అయితే.. మరికొన్ని సూపర్‌ ఓవర్లు వేయిస్తారు.

గెలుపు ఎవరిదో తేలిపోయే వరకు ప్రయత్నిస్తారు. సూపర్‌ ఓవర్లలో గెలిచే జట్టుకు కప్‌ దక్కుతుంది. ఒకవేళ వాతావరణ శాఖ అంచనాలు తప్పయి వాన పడితే మాత్రం ఇరు జట్లను విజేతగా ప్రకటిస్తారు.

కాగా, ఫైనల్‌ మ్యాచుకు భారత్‌, న్యూజిలాండ్ సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఈ మ్యాచుకు అంపైర్ల పేర్లను ఐసీసీ ప్రకటించింది. ఆన్‌ ఫీల్డ్‌ అంపైర్లుగా ఈ మ్యాచులో పాల్‌ రీఫిల్‌, రిచర్డ్‌ ఇల్లింగ్‌వర్త్‌ ఉంటారు. థర్డ్‌ అంపైర్‌గా జోయల్‌ విల్సన్‌ ఉంటారు. ఇక ఫోర్త్‌ అంపైర్‌గా కుమార ధర్మసేన వ్యవహరిస్తారు. మ్యాచ్‌ రిఫరీగా రంజన్‌ మదుగలే ఉంటారు.