Ind Vs Nz : అక్షర్ మాయ… 296 పరుగులకు న్యూజిలాండ్ ఆలౌట్
కాన్పూర్ వేదికగా న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో భారత బౌలర్లు రాణించారు. తొలి ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ 296 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

Ind Vsnnz Axar Patel
Ind Vs Nz : కాన్పూర్ వేదికగా న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో భారత బౌలర్లు రాణించారు. తొలి ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ 296 పరుగులకే ఆలౌట్ అయ్యింది. భారీ స్కోరు సాధిస్తుందని భావించిన కివీస్‌ను కట్టడి చేయడంలో టీమిండియా బౌలర్లు సక్సెస్ అయ్యారు. పిచ్ నుంచి సహకారం లభించకపోయినా స్పిన్నర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. భారత్‌కు స్వల్ప ఆధిక్యం దక్కడంలో కీ రోల్ ప్లే చేశారు. రెండో రోజు కాస్త వెనుకడుగు వేసినట్లు అనిపించినా.. మళ్లీ భారత్ పట్టు సాధించింది.
New House : కొత్త ఇంట్లో పాలు పొంగించాలా…ఎందుకు
నిన్న ఒక్క వికెట్ కూడా తీయని భారత బౌలర్లు ఇవాళ అదరగొట్టారు. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 345 పరుగులు చేయగా, 49 పరుగుల స్వల్ప ఆధిక్యం పొందింది. కివీస్ బ్యాటర్లలో లాథమ్(95), యంగ్(89) రాణించారు. మిగతా వారు విఫలం అయ్యారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ 5 వికెట్లు తీశాడు. అశ్విన్ 3 వికెట్లు తీయగా జడేజా, ఉమేష్, తలో వికెట్ తీశారు.
రెండో రోజు భారత బౌలర్లకు కొరకరాని కొయ్యలా మారిన కివీస్ బ్యాటర్లు మూడో రోజు తలొగ్గారు. యువ స్పిన్నర్ అక్షర్ పటేల్ (5/62), అశ్విన్ (3/82) దెబ్బకు న్యూజిలాండ్ కుదేలైంది. అక్షర్ పడగొట్టిన ఐదు వికెట్లలో రెండు బౌల్డ్‌లు, రెండు స్టంపౌట్‌లు, ఒక ఎల్బీడబ్ల్యూ ఉండటం విశేషం. కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 296 పరుగులకు ఆలౌట్ కావడంతో భారత్‌కు 49 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది.
ఓపెనర్లు టామ్ లేథమ్ (95), విల్ యంగ్ (89) సెంచరీ చాన్స్ చేజార్చుకున్నారు. ఆఖర్లో జేమీసన్ (75 బంతుల్లో 23) భారత బౌలర్లకు కాసేపు విసుగు తెప్పించినా కివీస్‌కు మాత్రం ఆధిక్యం దక్కేలా చేయలేకపోయాడు. వీరు ముగ్గురు మినహా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు.