×
Ad

IND vs SA : తొలి టీ20 మ్యాచ్‌లో ఘోర ఓట‌మి.. ‘మేమేందుకు ఓడిపోయామంటే..’ ద‌క్షిణాఫ్రికా కెప్టెన్ మార్‌క్ర‌మ్ కామెంట్స్..

మంగ‌ళ‌వారం క‌ట‌క్ వేదిక‌గా ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన తొలి వ‌న్డేలో (IND vs SA) భార‌త్ 101 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది.

IND vs SA 1st T20 Aiden Markram comments after South Africa lost match to India

IND vs SA : ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భార‌త్ శుభారంభం చేసింది. మంగ‌ళ‌వారం క‌ట‌క్ వేదిక‌గా ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన తొలి వ‌న్డేలో భార‌త్ 101 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. కాగా.. ఈ మ్యాచ్‌లో ఓట‌మిపై ద‌క్షిణాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్‌క్ర‌మ్ స్పందించాడు. బ్యాటింగ్ వైఫ‌ల్యం కార‌ణంగానే తాము ఓడిపోయామ‌ని చెప్పుకొచ్చాడు. బ్యాటింగ్‌లో త‌మ స్థాయికి త‌గ్గ‌ట్లుగా ఆడ‌లేక‌పోయిన‌ట్లుగా అంగీక‌రించాడు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భార‌త్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 175 ప‌రుగులు చేసింది. టీమ్ఇండియా బ్యాట‌ర్ల‌లో హార్దిక్ పాండ్యా (59 నాటౌట్‌; 28 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) హాఫ్ సెంచ‌రీ చేశాడు. తిల‌క్ వ‌ర్మ (26), అక్ష‌ర్ ప‌టేల్ (23)లు ప‌ర్వాలేద‌నిపించారు. ద‌క్షిణాఫ్రికా బౌల‌ర్ల‌లో లుంగి ఎంగిడి మూడు వికెట్లు తీశాడు. లుథో సిపామ్లా రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. డోనోవన్ ఫెర్రీరా ఓ వికెట్ సాధించాడు.

IPL 2026 Auction : ఐపీఎల్ 2026 మినీ వేలం.. షార్ట్ లిస్ట్‌లో ఉన్న క్యాప్డ్ ప్లేయ‌ర్లు వీరే.. ఎవ‌రి బేస్ ప్రైజ్ ఎంతంటే?

అనంత‌రం 176 ప‌రుగుల ల‌క్ష్య ఛేద‌న‌లో సౌతాఫ్రికా ఘోరంగా విఫ‌లమైంది. 12.3 ఓవ‌ర్ల‌లో 74 ప‌రుగుల‌కే ఆలౌటైంది. సౌతాఫ్రికా బ్యాట‌ర్ల‌లో డెవాల్డ్ బ్రెవిస్ (22), ట్రిస్టన్ స్టబ్స్ (14), ఐడెన్ మార్‌క్ర‌మ్ (14), మార్కో జాన్సెన్ (12) లు మాత్ర‌మే రెండు అంకెల స్కోరు సాధించారు. భార‌త బౌల‌ర్ల‌లో అర్ష్‌దీప్ సింగ్, జ‌స్‌ప్రీత్ బుమ్రా, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, అక్ష‌ర్ ప‌టేల్ లు త‌లా రెండు వికెట్లు తీశారు. హార్దిక్ పాండ్యా, శివ‌మ్ దూబెలు చెరో వికెట్ సాధించారు.

మ్యాచ్ అనంత‌రం త‌మ జ‌ట్టు ఓట‌మిపై ద‌క్షిణాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్‌క్ర‌మ్ స్పందించాడు. తాము బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న చేశామ‌న్నాడు. బౌలింగ్‌లో తాము అనుకున్న విధంగా ప్రారంభించామని, అందుకు సంతోషంగా ఉన్న‌ట్లు తెలిపాడు. దుర‌దృష్ట‌వ‌శాత్తు బ్యాటింగ్‌లో రాణించ‌లేక‌పోయామ‌న్నాడు.

‘ఈ ఫార్మాట్‌లో ఇలా జ‌ర‌గ‌డం సాధార‌ణ‌మే. అయితే.. తొలి మ్యాచ్‌లోనే ఇలా జ‌ర‌గ‌డం బాధాక‌రంగా ఉంది. ఈ ఓట‌మి నుంచి పాఠాలు నేర్చుకుంటాము. సాధ్య‌మైనంత త్వ‌ర‌గా మ్యాచ్‌ను మ‌రిచిపోయి త‌దుప‌రి పోరుకు సిద్ధం కావాల్సి ఉంది. రెండు రోజుల్లోనే రెండో టీ20 మ్యాచ్ ఉంది. ఆ మ్యాచ్‌లో విజ‌యం కోసం ఆడ‌తాం.’ అని మార్‌క్ర‌మ్ అన్నాడు.

2025లో పాకిస్తాన్ వాళ్లు పిచ్చి పిచ్చిగా వెతికిన మన ప్లేయర్ ఎవరో తెలుసా..? రోహిత్, కోహ్లీ కాదు..

ఏదీ ఏమైన‌ప్ప‌టికి కూడా 175 ప‌రుగుల ల‌క్ష్యాన్ని చేదించ‌వ‌చ్చున‌ని అన్నాడు. భాగ‌స్వామ్యాలు నిర్మించ‌లేక‌పోవ‌డం, నిల‌క‌డ‌గా ఆడ‌లేక‌పోవ‌డం, వికెట్లు కోల్పోవ‌డం ఓట‌మికి కార‌ణాలు. వీటి గురించి పెద్ద‌గా ఆలోచించాల్సిన ప‌నిలేద‌ని త‌దుప‌రి మ్యాచ్‌పై దృష్టి పెడ‌తామ‌ని మార్‌క్ర‌మ్ తెలిపాడు.