×
Ad

IND vs SA : ఈడెన్ గార్డెన్స్ పిచ్ ప‌ట్ల సంతోషంగా లేని గౌతమ్ గంభీర్, శుభ్‌మన్ గిల్..? క్యూరేటర్‌తో సుదీర్ఘ సంభాష‌ణ‌!

న‌వంబ‌ర్ 14 నుంచి కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా భార‌త్‌, ద‌క్షిణాఫ్రికా జ‌ట్ల మ‌ధ్య (IND vs SA) తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది.

IND vs SA 1st Test Gambhir and Shubman Gill Not Happy With Eden Gardens Pitch

IND vs SA : రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా భార‌త్‌, ద‌క్షిణాఫ్రికా జ‌ట్ల మ‌ధ్య న‌వంబ‌ర్ 14 నుంచి కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్ప‌టికే భార‌త్‌, ద‌క్షిణాప్రికా జ‌ట్లు కోల్‌క‌తాకు చేరుకున్నాయి. తొలి టెస్టులో విజ‌యం సాధించేందుకు నెట్స్‌లో తీవ్రంగా శ్ర‌మిస్తున్నాయి.

ఇదిలా ఉంటే.. తొలి టెస్టు మ్యాచ్‌కు (IND vs SA ) ముందు మంగ‌ళ‌వారం టీమ్ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్.. కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్‌, బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోట‌క్‌, బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్‌తో క‌లిసి ఈడెన్ పిచ్‌ను ప‌రిశీలించారు. ఆ త‌రువాత పిచ్ క్యూరేట‌ర్ సుజ‌న్ ముఖ‌ర్జీతో గంభీర్ చాలా సుదీర్ఘంగా చ‌ర్చించారు.

Rishabh Pant : ద‌క్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌.. చ‌రిత్ర సృష్టించేందుకు అడుగుదూరంలో రిష‌బ్ పంత్..

పిచ్ పై కాస్త ప‌చ్చిక ఉంద‌ని, శుక్ర‌వారం మ్యాచ్ ప్రారంభం కానున్న స‌మ‌యానికి పిచ్‌లో పెద్ద‌గా మార్పులు ఉండే అవ‌కాశం లేద‌ని పీటీఐ తెలిపింది. ఈ పిచ్ పై టీమ్ఇండియా మేనేజ్‌మెంట్ అసృంత‌ప్తిగా ఉన్న‌ట్లు పేర్కొంది. ఈ విష‌య‌మై గంభీర్ పిచ్ క్యూరేటర్‌తో మాట్లాడిన‌ట్లుగా వెల్ల‌డించింది.

స్పిన్ పిచ్ అడ‌గ‌లేదు..

తొలి టెస్టు మ్యాచ్‌లో ఎలాంటి పిచ్ ఉండ‌బోతుంద‌నే విష‌య‌మై ఇప్ప‌టికే బెంగాల్ క్రికెట్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు సౌర‌వ్ గంగూలీ కార్లిటీ ఇచ్చారు. స్పిన్ పిచ్ కావాల‌ని భారత జ‌ట్టు అడ‌గ‌లేద‌ని వెల్ల‌డించాడు. కొద్దిగా నిల‌బ‌డి ఆడితే బ్యాట‌ర్లు ప‌రుగుల వ‌ర‌ద పారించ‌డం పెద్ద క‌ష్టం కాద‌న్నాడు.

Azam Khan : మ్యాచ్ మ‌ధ్య‌లో ఘోర అవ‌మానం.. ఏడ్చేసిన పాక్ క్రికెట‌ర్ ఆజం ఖాన్‌.. నాకు ఇజ్జ‌త్ ఉందా?

అంత‌క‌ముందు.. పిచ్ క్యూరేట‌ర్ మాట్లాడుతూ.. పిచ్‌పై చాలా త్వ‌ర‌గా ప‌గుళ్లు క‌నిపించే అవ‌కాశం ఉంద‌న్నాడు. మ్యాచ్ సాగుతున్న కొద్ది రివ‌ర్స్ స్వింగ్‌కు చాన్స్ ఉంద‌న్నాడు. వికెట్ స్థిరంగా బౌన్స్ అవ్వ‌డంతో పాటు బ్యాట‌ర్ల‌కు స‌హ‌క‌రిస్తుంద‌ని, ఇది మంచి వికెట్ అని అన్నాడు.

ఇదిలా ఉంటే.. ఈ సీజ‌న్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఈడెన్ గార్డెన్స్ రెండు రంజీ ట్రోఫీ మ్యాచ్‌ల‌కు ఆతిథ్యం ఇచ్చింది. అప్పుడు పిచ్ నెమ్మ‌దిగా ఉండ‌డం వ‌ల్ల పేస‌ర్ల‌కు పెద్ద‌గా స‌హ‌కారం ల‌భించ‌లేదు.