Rishabh Pant : దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్.. చరిత్ర సృష్టించేందుకు అడుగుదూరంలో రిషబ్ పంత్..
దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు ముందు టీమ్ఇండియా వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ (Rishabh Pant) ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది.
Most sixes for India in Tests Rishabh Pant need one six create history
Rishabh Pant : నవంబర్ 14 నుంచి భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌కు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ ఆతిథ్యం ఇస్తోంది. కాగా.. ఈ టెస్టు సిరీస్‌కు ముందు టీమ్ఇండియా వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ (Rishabh Pant) ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది.
2018లో రిషబ్ పంత్ అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో అరంగ్రేటం చేశాడు. ఇప్పటి వరకు 47 టెస్టులు ఆడాడు. 82 ఇన్నింగ్స్‌ల్లో 44.5 సగటుతో 3427 పరుగులు చేశాడు. ఇందులో 8 శతకాలు, 18 అర్థశతకాలు ఉన్నాయి. ఇప్పటి వరకు పంత్ టెస్టుల్లో 90 సిక్సర్లు బాదాడు.
దక్షిణాఫ్రికాతో జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో పంత్ ఒక్క సిక్సర్ కొడితే సుదీర్ఘ ఫార్మాట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత ప్లేయర్‌గా రికార్డులకు ఎక్కుతాడు. ప్రస్తుతం ఈ జాబితాలో వీరేంద్ర సెహ్వాగ్‌తో కలిసి అతడు సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు. అలాగే.. పంత్ ఈ సిరీస్‌లో 10 సిక్సర్లు కొడితే టీమ్ఇండియా తరుపున సుదీర్ఘ ఫార్మాట్‌లో 100 సిక్సర్లు కొట్టిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు.
భారత్ తరుపున టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్లు వీరే..
* రిషబ్ పంత్ – 47 టెస్టుల్లో 90 సిక్సర్లు
* వీరేంద్ర సెహ్వాగ్ – 103 టెస్టుల్లో 90 సిక్సర్లు
* రోహిత్ శర్మ – 67 టెస్టుల్లో 88 సిక్సర్లు
* రవీంద్ర జడేజా – 87 టెస్టుల్లో 80 సిక్సర్లు
* ఎంఎస్ ధోని – 90 టెస్టుల్లో 78 సిక్సర్లు
భారత్, దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్ షెడ్యూల్ ఇదే..
* తొలి టెస్టు – నవంబర్ 14 నుంచి 18 వరకు – కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా..
* రెండో టెస్టు – నవంబర్ 22 నుంచి 26 వరకు – గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియం వేదికగా..
