Ind Vs Sl
Ind Vs SL 1st Test: భారత్, శ్రీలంక (Ind Vs SL 1st Test) జట్ల మధ్య మొహాలీ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ భారీ స్కోర్ చేసింది. 85ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 357 పరుగులు చేసింది. భారత బ్యాటర్లు లంక బౌలర్లను దంచికొట్టారు. స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. తన వందో టెస్టులో సెంచరీ చేస్తాడని అనుకుంటే… 45 పరుగులకే ఔట్ అయ్యి అభిమానులను నిరాశకు గురిచేశాడు విరాట్ కోహ్లీ.
అయితే రిషబ్ పంత్, హనుమ విహారి అదరగొట్టారు. హాఫ్ సెంచరీలతో చెలరేగారు. మొదటి రోజు ఆటలో భారత్ కు ఆధిక్యత దక్కేలా చేశారు. కెప్టెన్ రోహిత్ శర్మ (29), మయాంక్ (33), విహారి (58), కోహ్లీ (45), శ్రేయస్ అయ్యర్ (27) పరుగులు చేశారు. చివర్లో రిషబ్ పంత్ (96) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. కాగా, తృటితో సెంచరీ మిస్ అయ్యాడు.
పంత్ 97 బంతుల్లోనే 96 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్ 9 ఫోర్లు, 4 సిక్సులు ఉన్నాయి. ప్రస్తుతం క్రీజులో జడేజా(45*), అశ్విన్ (10*) ఉన్నారు. శ్రీలంక బౌలర్లలో లసిత్ ఎంబుల్దెనియా 2 వికెట్లు తీశాడు. లాహిరు కుమార, విశ్వ ఫెర్నాండో, ధనంజయ డి సిల్వా, లక్మల్ చెరో వికెట్ తీశారు. ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. వన్‌డౌన్‌లో వచ్చిన తెలుగు కుర్రాడు హనుమ విహారి (58) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. Ind Vs SL 1st Test
IPL 2022: చెన్నైకి ఎదురుదెబ్బ.. రూ. 14కోట్ల ఆటగాడు అవుట్!
టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ హాఫ్ సెంచరీ తర్వాత దూకుడుగా ఆడుతూ శతకం దిశగా సాగుతున్న అతడి జోరుకి సురంగ లక్మల్ కళ్లెం వేశాడు. 81వ ఓవర్లో ఐదో బంతికి అతడిని బౌల్డ్ చేశాడు. 4 పరుగుల తేడాలో సెంచరీ మిస్ కావడంతో పంత్ నిరాశగా వెనుదిరిగాడు. పంత్ 90ల్లో ఔట్ కావడం ఇది 5వ సారి. కాగా.. టెస్టుల్లో భారత్ తొలిరోజే 350కి పైగా పరుగులు చేయడం ఇది 14వ సారి. ఇందులో శ్రీలంకపైనే ఐదు సార్లు ఇంతటి భారీ స్కోర్లు నమోదు చేయడం గమనార్హం.
కోహ్లీ @ 8000
ఈ టెస్టు మ్యాచ్ ద్వారా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్టుల్లో 8 వేల పరుగుల మైలురాయి చేరుకున్నాడు. ఈ ఘనత సాధించిన ఆరో టీమిండియా బ్యాట్స్‌మన్‌గా రికార్డులకెక్కాడు. ఫెర్నాండో వేసిన 38.2 ఓవర్‌కు సింగిల్ తీసి కోహ్లీ ఈ ఘనత సాధించాడు. కాగా, కోహ్లీ ఇలా వందో టెస్టులో 8 వేల పరుగుల మైలురాయి చేరుకున్న రెండో ఆటగాడిగా నిలిచాడు. ఇంతకుముందు ఆస్ట్రేలియా మాజీ సారథి రికీ పాంటింగ్ కూడా తన వందో టెస్టులోనే ఈ ఘనత సాధించాడు. అప్పుడు పాంటింగ్ రెండు ఇన్నింగ్స్‌ల్లో శతకాలు బాదడం విశేషం. Ind Vs SL 1st Test
India vs Sri Lanka : టీమిండియా మరో పోరు.. కోహ్లీ 100వ టెస్టు
కాగా.. విరాట్ కోహ్లీ మరోసారి భారీ స్కోరు మిస్సయ్యాడు. భారత్-లంక మధ్య మ్యాచ్.. కోహ్లీ కెరీర్ లో వందో టెస్టు మ్యాచ్. దీనిపై క్రికెట్ లెజెండ్స్ నుంచి అభినందనలు అందుకున్న కోహ్లీ.. భారీ స్కోరు నమోదు చేస్తాడనే అంచనాలు ఉన్నాయి. వీటన్నిటినీ పటాపంచలు చేస్తూ హాఫ్ సెంచరీ కూడా చేయకుండానే అవుట్ అయ్యాడు కోహ్లీ.(Ind Vs SL 1st Test)
2019 టైంలో ఉన్నంత ఫామ్ ఇప్పుడు కోహ్లీలో కనిపించడం లేదు. అయితే శుక్రవారం జరిగే మ్యాచ్ లో కోహ్లీ ఎన్ని పరుగులు చేస్తాడో ఓ నెటిజన్ ముందుగానే చెప్పేసింది.
‘కోహ్లీ వందో టెస్టులో వంద పరుగులు చేయలేడు. కేవలం 45పరుగులు మాత్రమే నమోదు చేస్తాడు. నాలుగు అద్భుతమైన కవర్ డ్రైవ్‌లు ఆడి ఎంబుల్డెనియా చేతుల్లో స్టంప్స్ ముందు అవుట్ అయిపోయి షాక్ అయినట్లు యాక్ట్ చేస్తాడు. దాంతో పాటు మొహంపై అసంతృప్తితో ఉన్నట్లు రియాక్షన్ వస్తుంది’ అంటూ తెల్లవారితే శుక్రవారం అనగా అర్ధరాత్రి 12గంటల 46నిమిషాలకే పోస్టు చేశారు. అంతా చెప్పినట్లే జరగడంతో ఈ ట్వీట్ ట్రెండ్ కావడంతో పాటు ఇప్పటికే 5వేల రీట్వీట్లు, 15వేల లైక్‌లు దక్కించుకుంది. వందో టెస్టు ఆడిన కోహ్లీ.. టెస్ట్ క్రికెట్ లో 8వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ ఘనత దక్కించుకున్న ఆరో ఇండియన్ క్రికెటర్ గా నిలిచాడు.(Ind Vs SL 1st Test)