Ind Vs Sri Lanka : గులాబీ బంతితో చెలగిరేన భారత బౌలర్లు.. 50 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన లంక
తొలి ఇన్నింగ్స్ లో టీమిండియాను 252 పరుగులకే కట్టడి చేసిన శ్రీలంకకు ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. (Ind Vs Sri Lanka)

Ind Vs Sl Pink Balll
Ind Vs Sri Lanka: బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు (పింక్ బాల్ టెస్ట్) మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్ లో టీమిండియాను 252 పరుగులకే కట్టడి చేసిన శ్రీలంకకు.. ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. మొదటి రోజు భోజన విరామం తర్వాత తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన లంకను.. టీమిండియా పేసర్లు హడలెత్తించారు. గులాబీ బంతితో చెలరేగారు. లంక బ్యాటర్లను బెంబేలెత్తించారు. బుమ్రా, మహమ్మద్ షమీ చెరో రెండు వికెట్ల తీసి లంకను దెబ్బకొట్టారు. దాంతో ఆ జట్టు 28 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.(Ind Vs Sri Lanka)
అయితే, సీనియర్ ఆటగాడు ఏంజెలో మాథ్యూస్ (20 బ్యాటింగ్), చరిత్ అసలంక (5) జోడీ వికెట్ల పతనాన్ని అడ్డుకున్నట్టే కనిపించింది. అయితే అది కాసేపే అయింది. అసలంకను అక్షర్ పటేల్ ఔట్ చేయడంతో లంక కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. లంక 18 ఓవర్లలో 50 పరుగులకే సగం వికెట్లు(5) కోల్పోయింది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేస్తూ లంక బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నారు.(Ind Vs Sri Lanka)
బెంగళూరు వేదికగా శ్రీలంకంతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో(పింక్ బాల్ టెస్ట్-డే/నైట్) తొలి రోజే భారత్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. లంక స్పిన్నర్లు విజృంభించడంతో 59.1 ఓవర్లలో 252 పరుగులకే భారత్ ఆలౌట్ అయ్యింది. కఠినమైన పిచ్ పై శ్రేయస్ అయ్యర్ అదరగొట్టాడు. 98 బంతుల్లో 92 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అతడి ఇన్నింగ్స్ లో 4 సిక్సులు, 10 ఫోర్లు ఉన్నాయి. కాగా, సెంచరీ చేసే చాన్స్ మిస్ చేసుకున్నాడు. రిషబ్ పంత్ (39), హనుమ విహారి (31) ఫర్వాలేదనిపించారు. రోహిత్ శర్మ(15), మాయంక్ అగర్వాల్(4), విరాట్ కోహ్లి(23), రవీంద్ర జడేజా(4), అశ్విన్(13) రాణించలేకపోయారు. లంక బౌలర్లలో లసిత్ ఎంబుల్దెనియా, ప్రవీణ్ జయవిక్రమ చెరో మూడు వికెట్లు తీశారు. ధనంజయ డి సిల్వా రెండు వికెట్లు, సురంగ లక్మల్ ఒక వికెట్ తీశారు.
తొలి సెషన్‌లో 93 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన భారత్ ను రెండో సెషన్‌లో శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ (39) ఆదుకున్నారు. వీరిద్దరూ పోటాపోటీగా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ టీ20 మ్యాచ్ తరహాలో ఆడాడు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఎంబుల్దేనియా వేసిన 35 ఓవర్‌లో మూడు ఫోర్లు బాదిన అయ్యర్.. ధనుంజయ వేసిన 48 ఓవర్‌లో రెండు సిక్సర్లు బాది హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
Women’s World Cup 2022 : వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం..చెలరేగిన స్మృతి, హర్మన్ ప్రీత్
పంత్ కూడా క్రీజులో ఉన్నంత సేపు దూకుడుగానే ఆడాడు. ధనుంజయ వేసిన 30వ ఓవర్‌లో పంత్ వరుసగా రెండు ఫోర్లు బాదాడు. జయవిక్రమ వేసిన తర్వాతి ఓవర్‌లోనూ ఇదే సీన్ రిపీట్ అయింది. మంచి ఊపుమీదున్న పంత్‌ని ఎంబుల్దేనియా పెవిలియన్ పంపాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన గత మ్యాచ్ హీరో రవీంద్ర జడేజా (4) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. జడేజాను కూడా ఎంబుల్దేనియానే ఔట్ చేశాడు. రవిచంద్రన్ అశ్విన్ (13)ను ధనుంజయ పెవిలియన్‌కి పంపగా.. అక్షర్ పటేల్ (9) లక్మల్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. జయవిక్రమ బౌలింగ్‌లో షమి (5) ధనుంజయకు చిక్కాడు. జయవిక్రమ వేసిన 59.1వ ఓవర్‌లో భారీ షాట్ ఆడబోయిన శ్రేయస్ స్టంపౌటయ్యాడు. దీంతో 252 పరుగులకు టీమిండియా ఆలౌట్ అయ్యింది.